Switch to English

జస్ట్ ఆస్కింగ్: తిరుపతిలో ఎవరు గెలిస్తే ఏమవుతుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

‘పాదయాత్రలో వైఎస్ జగన్ కోసం పనిచేసిన వ్యక్తికి లోక్ సభ అభ్యర్థిగా వైసీపీ అవకాశమిచ్చింది. అంటే, జగన్ సేవ చేసినందుకే ఎంపీ అవకాశం అన్నమాట..’ అంటూ భారతీయ జనతా పార్టీ, వైసీపీ అభ్యర్థి గురుమూర్తి విషయమై తనదైన రీతిలో వెటకారం చేస్తోంది. మరి, రత్నప్రభకు ఏ ప్రాతిపదికన లోక్ సభ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేసినట్లు.? అంటే, రత్నప్రభ గతంలో ఐఏఎస్ అధికారిణిగా పనిచేశారు.. అంటే, జన సేవ చేశారట. జనసేవ చేసిన రత్నప్రభనే తిరుపతి ఎంపీగా గెలిపించాలన్నది బీజేపీ వెర్షన్.

ఇక, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విషయానికొస్తే, ఆమె గతంలో చంద్రబాబుని ఏ స్థాయిలో విమర్శించారో ఆనాటి వీడియోలన్నిటినీ బీజేపీ సోషల్ మీడియాలో వుంచుతోంది. తిరుపతి ఎంపీగా గతంలో పనిచేసిన చింతా మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఈ నలుగురి చుట్టూనే పోటీ నడుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో పుంజుకునే అవకాశం లేకపోయినా, చింతా మోహన్ కొన్ని ఓట్లనైతే గట్టిగానే చీల్చవచ్చు. ఇక, ప్రధాన పోటీ మాత్రం వైసీపీ – టీడీపీ మధ్యనే వుండబోతోంది. అలాగని బీజేపీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పవన్ కళ్యాణ్ ప్రచారంతో రత్నప్రభ గెలుపు అవకాశాలు అనూహ్యంగా పెరగొచ్చు.

నిన్న మొన్నటిదాకా స్తబ్దగా వున్న జనసేన శ్రేణులు, ఎప్పుడైతే పవన్ వద్దకు రత్నప్రభ వెళ్ళారో ఆ తర్వాత యాక్టివ్ అయ్యాయి. జనసేనాని తిరుపతిలో పర్యటిస్తే, ఆ తర్వాత సీన్ మరింతగా మారుతుందనడం నిస్సందేహం. అయితే, ఎవరు గెలిచినా తిరుపతికి ఏం ఉపయోగం వుండదు.. అన్న చర్చ మాత్రం గట్టిగా నడుస్తోంది. బరిలో వున్న అభ్యర్థుల్లో ఎవరికీ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదన్నది స్థానికంగా వినిపిస్తోన్న మాట.

‘రాష్ట్రానికి ఏమీ ఇవ్వం.. పైగా, వున్నవి లాగేసుకుంటాం..’ అన్నట్టు వ్యవహరిస్తోంది బీజేపీ. అదే బీజేపీకి పెద్ద మైనస్. టీడీపీకి ఓటేసినా లాభమేంటి.? అన్న భావనలో చాలామంది ఓటర్లున్నారు. ఇక, వైసీపీ కూడా మెజార్టీ సీట్లు 2019 ఎన్నికల్లో గెలిచినా, రాష్ట్రం వాయిస్ పార్లమెంటు సాక్షిగా వినిపించడంలో విఫలమైందన్న నిర్వేదం జనంలో వుంది. సో, ఎలా చూసినా.. తిరుపతి ఉప ఎన్నిక రాజకీయ పార్టీల్లో తప్ప, ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించడంలేదన్నమాట. ఎవరు గెలిచినా, తమకు ఉపయోగం లేదన్న భావనకు ప్రజలు వచ్చేయడమంటే.. అంతకన్నా దారుణం ఇంకోటుండదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...