Switch to English

అమెరికా ‘ఇమ్మిగ్రేషన్‌’ ఆపేస్తే ఎవరికి నష్టం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ మహమ్మారిగా మారుతోందని తెలిసీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెటకారాలు చేయడం చూశాం. ‘అమెరికాని కరోనా వైరస్‌ ఏమీ చేయలేదు..’ అంటూ మొదట్లో అహంకారం ప్రదర్శించిన ట్రంప్‌, ఆ తర్వాత కరోనా విలయం చూసి బెంబేలెత్తిన విషయం విదితమే. ‘భారతదేశం గనుక హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ని మాకు ఇవ్వకపోతే, ఆ తర్వాత పరిణామాలు ఇంకోలా వుంటాయి..’ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ట్రంప్‌కే చెల్లింది.

ఆ సంగతి పక్కన పెడితే, కరోనా దెబ్బకి అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. వేలాది మరణాలు అమెరికాలో సంభవించాయి. అగ్రరాజ్యానికీ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది కరోనా వైరస్‌ కారణంగా. ఈ నేపథ్యంలోనే ‘దిద్దుబాటు’ చర్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ‘ఇమ్మిగ్రేషన్‌’కి తాత్కాలికంగా ‘బ్రేక్‌’ వేశారు. ‘అమెరికన్లు సంక్షోభంలో వున్నారు.. వారికి ఉపాధి కల్పించాలంటే, ఇమ్మిగ్రెంట్స్‌కి షాక్‌ ఇవ్వక తప్పదు..’ అంటూ ట్రంప్‌ ప్రకటించిన విషయం విదితమే.

అయితే, కరోనా వైరస్‌కి ముందు.. కరోనా వైరస్‌ తర్వాత.. పరిస్థితులకు స్పష్టమైన తేడా కన్పిస్తోంది. ‘విదేశీ మోజు’ ఇప్పుడు చాలా దేశాలకు తగ్గిపోయింది. ప్రధానంగా మన దేశంలో ‘అమెరికా మోజు’ ఇకపై వుండదా.? అన్న చర్చ జరుగుతోందంటే పరిస్థితులు ఎలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు. ‘ఇకపై ఎవరూ అమెరికా వెళ్ళాలనే ఆలోచన చేయరు’ అనడం సబబు కాదుగానీ, అమెరికా సహా విదేశాల్లో ఉపాధి పొందాలనో, అక్కడే స్థిరపడాలనో ఆలోచన చేసేవారి సంఖ్య మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

‘ఇమ్మిగ్రెంట్స్‌ని తాత్కాలికంగా నిలిపేయడం’ అనేది అర్థం పర్థం లేని చర్య.. అని అమెరికాలోని ఆర్థిక వేత్తలే చెబుతున్నారు. అగ్రరాజ్యానికి ఇమ్మిగ్రెంట్స్‌ ద్వారా అందుతున్న ఆర్థిక ఊతం అంతా ఇంతా కాదు. ఆ ఇమ్మిగ్రెంట్స్‌ లేకపోతే, అమెరికా ప్రపంచం దృష్టిలో పలచనైపోతుందనీ, ముందు అమెరికా అత్యంత దారుణమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంచలన నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే సడలింపులు ఇవ్వడం డోనాల్డ్‌ ట్రంప్‌కి కొత్తేమీ కాదనుకోండి.. అది వేరే విషయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...