Switch to English

‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ వెళితే ఏమవుతుంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి ఇది తెలుగు రీమేక్. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.

తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కలిసి నటిస్తున్న సినిమా ‘గాడ్ ఫాదర్’. ఇదే తొలి తెలుగు సినిమా సల్మాన్ ఖాన్‌కి. ‘సల్మాన్ ఖాన్‌నే ఎందుకు తీసుకున్నారు.? ఆ అవకాశం నాకు ఇవ్వొచ్చు కదా.?’ అని ఆ మధ్య మరో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అడిగాడంటే, ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ పోషిస్తున్న పాత్ర ఎంత ప్రత్యేకమైనదో అర్థమవుతుంది.

‘లూసిఫర్’ సినిమా తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో అందుబాటులో వున్నా, ‘గాడ్ ఫాదర్’ మీద అంచనాలు భారీగానే వున్నాయి. తొలుత ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించొచ్చన్న ఊహాగానాలు వినిపించాయిగానీ, అవన్నీ జస్ట్ పుకార్లుగానే మిగిలిపోయాయ్.

కాగా, ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారన్నది ఓ ప్రచారం. అయితే, ఈ విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ అందుబాటులో వుండకపోవచ్చనీ, చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కావాలని కోరుకుంటున్నారనీ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

చిరంజీవి కోరుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి తీరతారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, పవన్ రావడం వల్ల ‘గాడ్ ఫాదర్’ సినిమాపై రాజకీయ విషం చిమ్మే అవకాశం వుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. చిరంజీవి మీద ప్రేమ నటిస్తోన్న వైసీపీ, పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్ముతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపిస్తే, వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేవు.

ఈ క్రమంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా మీద విపరీతమైన నెగెటివిటీ ప్రచారం చేసే అవకాశాల్లేకపోలేదు. ‘చిరంజీవిని పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు..’ అంటూ అర్థం పర్థం లేని వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో అన్నదమ్ములిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే, వైసీపీ నోళ్ళు మూతపడతాయన్నది మెగాభిమానుల వాదన.

అధికారం చేతిలో పెట్టుకుని, సినిమాల మీద ప్రతాపం చూపుతున్న వైసీపీ, ‘గాడ్ ఫాదర్’ మీద సైతం నిర్దాక్షణ్యంగా పైత్యం ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. మరి, ‘గాడ్ ఫాదర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరగబోతోంది.? పవన్ కళ్యాణ్ వెళతారా.? లేదా.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...