సంచలనం అంటే .. ఎప్పుడు చంకలో పెట్టుకుని హంగామా చేసే వర్మ, ఎప్పుడు ఏ సంచలనం రేపుతాడో ..అన్న ఆసక్తి ఇప్పటికి జనాల్లో ఉందంటే .. వర్మ సంచలనం ఆ రేంజ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో పెద్ద సంచలనం రేపిన వర్మ తాజాగా బ్యూటిఫుల్ అనే సినిమా తెరకెక్కించి .. చడి చప్పుడు లేకుండా లేకుండా రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నాడు.
అది సరికాదు అన్నట్టు తాజగా డ్రాగన్ లేడి గర్ల్ అనే సినిమాను తెరకెక్కించాడు. త్వరలో ఈ సినిమా విడుదల అవుతుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే వర్మ నెక్స్ట్ సినిమా ఏమిటో అన్న ఆసక్తి నెలకొన్న సందర్బంగా ముప్పావుల అనే టైటిల్ తో పవన్ కళ్యాణ్ డూప్ ఉన్న పోస్టర్ ఒకటి వర్మ అకౌంట్ లో పోస్ట్ అయింది.
దాన్ని చూసి అందరు .. వర్మ నెక్స్ట్ సినిమా ముప్పావులా ? అని అనుకున్నారు .. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై పలు రకాల కామెంట్స్ చేస్తూ రచ్చ చేసే వర్మ నెక్స్ట్ సినిమా విషయంలో ముప్పావుల అనేదే కన్ఫర్మ్ అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. జనసేన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ఈ సినిమా చేస్తున్నావా వర్మ అంటూ చాలా మంది కామెంట్స్ పెట్టారు.
ఈ విషయం పై ఎట్టకేలకు స్పందించాడు వర్మ .. ఈ ట్విట్టర్ లో వచ్చిన పోస్టర్ గురించి నాకేమి సంబంధం లేదు .. అది తన ట్విట్ కాదు ఎవరో మార్ఫింగ్ చేసిన ఫొటోతో దాన్ని పోస్ట్ చేసారని చెప్పాడు వర్మ. సో ముప్పావుల అనే టైటిల్ తో సినిమా ను వర్మ చేయడం లేదని అర్థం అవుతుంది. మరి వర్మ నెక్స్ట్ సినిమా ఏమిటి ? అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది !!
331290 786674It can be tough to write about this subject. I believe you did an outstanding job though! Thanks for this! 767931
392120 602623Extremely great post, thanks a whole lot for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 937032