Switch to English

ద యాక్షన్‌ స్టార్ట్స్‌ నౌ..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో ఎంపీ ఎన్నికల ప్రచారం ముగింపుదశకు వస్తున్నకొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. ఇన్నాళ్లూ రోడ్‌షోలు, సభలతో జరిగిన ప్రచారాన్ని మిగిలిన ఈ రెండు, మూడ్రోజులపాటు మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇన్ని రోజుల ప్రచారం ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకోవడమే అసలు సిసలు సమస్య. అందుకే అసలు యాక్షన్‌ ఇప్పుడే స్టార్టయిందని చెప్పుకోవాలి. మంగళవారం సాయంత్రం ఐదుగంటల వరకు మిగిలున్న ఈ విలువైన సమయాన్ని ఒక్కక్షణం కూడా వృధా చేయకుండా ఉండేలా ప్లాన్‌చేసుకున్నారు. దినమంతా సభలు, సమావేశాలు.. రాత్రయితే బూత్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణపై చర్చలు.. ఓటర్లను పోలింగ్‌బూత్‌కు తీసుకురావడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. అసంతృప్తితో పార్టీకి దూరమైన కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే.. గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో ఓట్ల పండగలో అసలైన ఘట్టానికి తెరలేచింది. గెలిచేందుకు కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైన అభ్యర్థులు చివరి బ్రహ్మాస్త్రంగా మద్యం, డబ్బు పంపీణీతోపాటు కానుకలను ఎరగావేస్తు‍న్నారు. పోటాపోటీగా ఓటర్ల కరుణ పొందేందుకు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసు, ఆదాయ పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి 41.04 కోట్ల రూపాయలు పట్టుబడగా.. అందులో రూ.20 కోట్లు చివరి మూడ్రోజుల్లో పట్టుబడదే. మద్యానికైతే లెక్కేలేదు. టఫ్‌ఫైట్‌ ఉంటుందనుకుంటున్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండ, మల్కాజ్‌గిరి స్థానాల్లో ఒక్కో ఓటుకు రూ.2 వేలకుపైనే ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. పేద, మధ్య తరగతి ప్రజల ఓట్లు లక్ష్యంగానే ఈ ప్రలోభాలు జోరుగా సాగుతున్నాయి.

కోట్లు ఖర్చుచేస్తున్నా.. ఓటింగ్‌శాతం పెరగకపోతే ఇబ్బందులు తప్పవనే అంశం అభ్యర్థులకు నిద్రలేకుండా చేస్తుంది. ఓటింగ్‌ సరళి అనుకున్నట్లుగా లేకపోతే.. ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగి.. మే 23వరకు ఫలితాలకోసం ఎదురుచూసి అభ్యర్థులకు బీపీ, షుగర్‌ పెరిగిపోతాయి. అందుకే ఒపీనియన్‌ లీడర్లను, వీలున్నచోట నేరుగా ఓటర్లను ప్రలోభపెట్టయినా పోలింగ్‌ బూత్‌కు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌, నగర శివార్లలోని ప్రాంతాల్లో అభ్యర్థులకు ఈ ఫీవర్‌ ఎక్కువగా ఉంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సగటున 73 శాతం పోలింగ్‌ నమోదు కాగా, రాజధాని పరిధిలోని నియోజకవర్గాల్లో 49 శాతం, శివారు ప్రాంతాల్లో 55శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. ఈసారి ఈ సంఖ్య వచ్చినా పర్వాలేదు.. కానీ ఇంతకన్నా తక్కువ వస్తే.. మాత్రం అభ్యర్థుల హార్ట్‌బీట్‌ పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.

ఓవైపు అభ్యర్థులు ప్రయత్నాలు జరుగుతుంటే ఆయా పార్టీల అధిష్టానాలు మాత్రం తమకు వీలున్న మార్గాల్లో సర్వే రిపోర్టులను తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో కేసీఆర్‌ది మొదటిస్థానం. నోటిఫికేషన్‌ వచ్చాక ఇప్పటివరకు నాలుగుసార్లు కేసీఆర్‌ సర్వే చేయించారు. చివరి రెండ్రోజుల్లో ట్రెండ్‌ను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌ పోలీసుల సాయంతో మరో సర్వే కూడా చేయిస్తున్నారు. సోమవారం కల్లా ఈ సర్వే సీఎం చేతికి అందుతుందని.. దీని ఆధారంగా చివరి రెండ్రోజుల్లో ఏం చేద్దామనేదానిపై వ్యూహరచన చేసే అవకాశం ఉంది. అటు, బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా తాము అంచనాలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో పరిస్థితేంటనే దానిపై బేరీజు వేసుకుంటున్నాయి. ఓవరాల్‌గా చూస్తే ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌కు పూర్తి అనుకూలంగా ఉందన్న వాతావరణంలో మార్పు వచ్చిందనేది సుస్పష్టం. ఇన్ని ప్రలోభాలు, కళ్లముందు వాస్తవాలు చూసిన తర్వాత ఓటరురాజు ఎటువైపు మొగ్గుతాడనేది మాత్రం మే 23నే తెలుస్తుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...