Switch to English

జగన్‌.. గెలిచెన్‌: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రారంభం!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమయ్యింది. మహాత్మాగాంధీ జయంతి నాడు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. మొదటి నుంచీ ఈ వ్యవస్థపై చాలా ఆనుమానాలు వ్యక్తమవుతున్నా.. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎన్నో వివాదాలు తెరపైకొచ్చినా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎక్కడా వెనుకంజ వేయలేదు.

పరీక్షల నిర్వహణలో కుంభకోణం జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తినా, జగన్‌ సర్కార్‌ లైట్‌ తీసుకుంది. మరోపక్క, ఏపీపీఎస్‌సీ ఉన్నతాధికారిని ఈ వ్యవహారానికి సంబంధించి బలిపశువుని చేసినట్లు తెలుస్తోంది. వ్యవహారం బయటకు పొక్కకుండా సదరు అధికారిపై బదిలీ వేటు వేసి చేతులు దులుపుకుందట వైఎస్‌ జగన్‌ సర్కార్‌.

ఇదిలా వుంటే, కొత్తగా అధికారంలోకి వచ్చాక కేవలం 120 రోజుల్లోనే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ లెక్కన వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చరిత్ర సృష్టించిందనే చెప్పుకోవాలి. అయినాగానీ, గ్రామ – వార్డు సచివాలయ ఉద్యోగుల విధులు ఏంటి.? అన్నదానిపై పూర్తి స్పష్టత లేదు. ఇప్పటికే మండల, గ్రామ, వార్డు వ్యవస్థలున్నాయి. ఆ వ్యవస్థలే సక్రమంగా పనిచేయని పరిస్థితి. కొన్ని వ్యవస్థల్ని పూర్తిగా తొలగిస్తారా.? లేదంటే, వాటికి సమాంతరంగా కొత్త వ్యవస్థలు పెత్తనం చెలాయిస్తాయా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోపక్క, అసలే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుంది. ఇలాంటి సమయంలో కుప్పలు తెప్పలుగా ప్రభుత్వ ఉద్యోగాలంటే, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి ఏమవుతుదో ఏమోనన్న ఆందోళనలూ లేకపోలేదు. ఏదిఏమైనా, పబ్లిసిటీకి పనికొచ్చే ఏ విషయంలోనూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వెనక్కి తగ్గడంలేదు. సొమ్ము ఒకడిది.. సోకు ఇంకొకడిది.. అన్న చందాన, ప్రజల సొమ్ముతో నిర్మించే వార్డు, గ్రామ సచివాలయాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రంగులు అద్దడం కూడా విమర్శలకు తావిస్తోంది.

గతంలో టీడీపీ అదే చేసింది, ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోందని సరిపెట్టుకోవాలా.? అలా సరిపెట్టుకోవాల్సి వస్తే రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే కదా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor: నాకు తెలీకుండా నా పెళ్లి చేసేలా ఉన్నారు: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె పిక్స్ కొన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈక్రమంలోనే ఆమె పెళ్లిపై కూడా...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 02 జూన్ 2024

పంచాంగం తేదీ 02- 06-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ ఏకాదశి రాత్రి 1.20 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం:...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 28 మే 2024

పంచాంగం తేదీ 28- 05-2024, మంగళవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ పంచమి ప.3.04 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం: ఉత్తరాషాడ...

ఎన్టీయారూ.. తెలుగు జాతీ.! ఓ రాజకీయ రచ్చ.!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.! తెలుగు నేల ఎంతోమంది మహనీయుల్ని చూసింది. కొందరు రాజకీయ ప్రముఖులు, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. అలాగే, కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కూడా.!...

ఐపీఎస్ ఏబీవీకి ఊరట.! ఈ రచ్చ ఎప్పటివరకూ.?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు కక్షగట్టిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? గడచిన ఐదేళ్ళుగా ఒకటే పంచాయితీ. టీడీపీ హయాంలో, ఐపీఎస్ అధికారిలా కాకుండా, టీడీపీ నేతలా ఆయన...