Trisha: సౌత్ బ్యూటీ క్వీన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష (Trisha) . సినిమాల్లోకి వచ్చి 24ఏళ్లు అవుతున్నా తరగని అందం ఆమె సొంతం. పొన్నియన్ సెల్వన్ (Ponniyan Selvan) సినిమాలతో మళ్లీ తన అందంతో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే త్రిష ఇప్పుడు ఓ దర్శకుడికి ఇచ్చిన రిప్లై ఆకర్షిస్తోంది.
2007లో తెలుగులో వెంకటేశ్ (Venkatesh) -త్రిష (Trisha) జంటగా సెల్వరాఘవన్ (Selva Raghavan) ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా తెరకెక్కించారు. దీనిపై ఆయన 2013లో.. ‘చాన్నాళ్ల తర్వాత సినిమా చూశా. వెంకటేశ్-త్రిషతో కలిసి పని చేయడం సంతృప్తినిచ్చింది. సీక్వెల్ చేయడానికి సిద్ధ’మంటూ ట్వీట్ చేశారు. అయితే.. పదేళ్ల తర్వాత ‘నేను కూడా రెడీ’ అంటూ త్రిష ఇప్పుడు రిప్లై ఇవ్వడం ఆకట్టుకుంటోంది. ఇంత త్వరగా రిప్లై ఇస్తారా.. అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ తో లియోలో నటిస్తోంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి 156వ సినిమాలో త్రిష నటిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అజిత్ తో విడమూయర్చి సినిమాలో కూడా నటిస్తోంది.
I’m ready @selvaraghavan 😝 https://t.co/9DCojSHe3u
— Trish (@trishtrashers) September 10, 2023
Qualityy coontent iss the key to interest tthe viewers
tto go tto see the website, that’s wgat tis web site is providing.
Hi, after reding thos aazing piece oof writing i am tooo cheeerful tto share my familiarity herre with mates.