అట్లీ కుమార్ కోలీవుడ్ లో చేసినవి నాలుగు సినిమాలు. అందులో మూడు సినిమాలు విజయ్ తోనే. ఇప్పుడు షారుఖ్ తో చేసిన జవాన్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో రికార్డులు తిరగరాస్తోంది. ఇదిలా ఉంటే జవాన్ కంటే ముందు అట్లీ తెలుగులో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ లేదా బన్నీతో అట్లీ సినిమా ఉంటుందని అన్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు.
కట్ చేస్తే ఇప్పుడు జవాన్ తో అట్లీ, పుష్పతో బన్నీ ప్యాన్ ఇండియన్ స్టార్స్ అయ్యారు. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే ఇండియా వైడ్ గా రేంజ్ మారిపోతుంది. అయితే అట్లీ ఏమనుకుంటున్నాడు?
జవాన్ కు సీక్వెల్ తీస్తాడా లేక నిజంగానే అల్లు అర్జున్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.