తెలుగు సినీ పరిశ్రమలో అమరావతి బాధితుల లిస్ట్ ఎంత.? ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్టుని అటకెక్కించి, విశాఖపట్నం – కర్నూలు నగరాల్ని రాజధానులుగా అభివృద్ధి చేయాలనుకుంటోన్న విషయం విదితమే. అమరావతి ప్రాజెక్టు స్థాయిని పూర్తిగా తగ్గించడం ద్వారా, రాజకీయంగా ప్రత్యర్థులపై ‘కసి’ తీర్చుకునేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్న విమర్శలున్నాయి.
ఇదిలా వుంటే, సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు, గత నాలుగేళ్ళలో సినీ ప్రముఖులు కొందరు అమరావతిలో పెట్టుబడులు బాగానే పెట్టారనీ, వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. నిజానికి, తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు ఆసక్తి చూపిన ప్రముఖులు ఇటీవలి కాలంలో చాలా తక్కువమందే వున్నారు. ఆ విషయమై చాలా విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక, ఇప్పుడు, అమరావతి బాధితుల లిస్ట్ గురించిన చర్చ ప్రముఖంగా తెరపైకొస్తోంది ఊహాగానాల రూపంలో.
ఓ స్టార్ హీరో, ఓ ప్రముఖ నిర్మాత, ఓ దర్శకుడు, ఓ సీనియర్ కమెడియన్.. ఇలా దాదాపు అరడజను పేర్లు విన్పిస్తున్నాయి. నిజమేనా.? అసలు అమరావతిలో వాళ్ళెందుకు పెట్టుబడులు పెట్టారు.? అనే ప్రశ్నలు కూడా తెరపైకొస్తుండడం గమనార్హం. ఎక్కువగా ‘ఇన్వెస్టిమెంట్’ ఆలోచనతోనే పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అందులో కొందరికి ఇప్పటి అధికార పార్టీతోనూ సన్నిహిత సంబంధాలుండడంతో వారంతా సేఫ్ అని అంటున్నారు.
858635 118436Soon after examine a couple of of the weblog posts on your website now, and I actually like your way of blogging. I bookmarked it to my bookmark web site list and shall be checking again soon. Pls try my internet site online as properly and let me know what you feel. 357817
514122 177547I believe this web site has got very great indited written content articles . 870178
700893 911111This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 362122
14187 227697Often the Are normally Weight reduction program is unquestionably an low-priced and flexible weight-reduction program product modeled on individuals seeking out shed some pounds combined with at some point sustain a far healthier your life. la weight loss 83306