మొదటి రౌండ్ కదా.. చాలా చప్పగా వుండడంలో వింతేముంది.? రెండో రౌండ్ కాస్త టఫ్‌గా మారింది.. ఆ తర్వాత ఇంకోటి.. ఇంకాస్త టఫ్.! అంతేనా.? ఇంకేమన్నా వుందా.! ఏమో, ఏం వుండబోతోందో.!
గడియారం.. ఓ ముల్లు.. అది తిరుగుతుంటుంది.. కంటెస్టెంట్లు ఎగురుతుండాలి.! ఎవరు ముందు కింద పడితే, వాళ్ళు ఔట్.! చిన్న పిల్లలాటలా వుంది కదా.! బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్‌లో టిక్కెట్ టు ఫినాలేకి సంబంధించిన టాస్క్ ఇలా మొదలైంది.
చూసేవాళ్ళు వెర్రి వెంగళప్పలైతే.. అది బిగ్ బాస్ రియాల్టీ షోనే.. అని ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. పువ్వులు తీసుకొచ్చి, ఓ చోట పెట్టాలి.. ఎక్కువ పువ్వులు పెట్టేవాళ్ళు, రేసులో ముందుకు వెళతారు. ఇంది ఇంకో ఎర్రి పుష్పం టాస్క్.! ఇది కూడా ఆడేశారు కంటెస్టెంట్లు.! మరో టాస్క్ అయితే, ఇంకా కామెడీ.. బంతికి రింగుతో కూడిన తాడేసి లాగాలి.! ఇక్కడ మాత్రం కాస్త గట్టిగానే కొట్టుకున్నంత పని చేశారు కంటెస్టెంట్లు.!
తక్కువ పాయింట్లతో రేసులోంచి తప్పుకోవాల్సి రావడంతో పాపం శోభా శెట్టి, ప్రియాంక తెగ ఏడ్చేశారు.! ఇలాంటివాటికే ఏడుస్తారా.? అంటూ వారితోపాటే ‘ఔట్’ అయిపోయిన శివాజీ, షరామామూలు కామెడీ చేసేశాడు. ఏంటి బిగ్ బాస్.. మరీ, వ్యూయర్స్‌ని అంతలా ఎర్రి పుష్పాల్ని చెయ్యాలా.? అని, చూసేవాళ్ళు నెత్తీనోరూ బాదుకుంటున్నారు.
కొంచెం టఫ్ టాస్కులు.. ఇంకాస్త ఇంటెలిజెంట్ గేమ్స్.. ఆపై, కొంత ఫిజికల్ టాస్కులు వుంటే కదా.. మజా వచ్చేది.? ఇవేవీ వుండవ్. ఎందుకంటే, అక్కడ బిగ్ బాస్‌కి అంత బుర్ర లేదు గనుక.! ఈ సీజన్ నిజానికి, పాజిటివ్ నోట్‌తో ప్రారంభమై, చాలా డల్లుగా ముగింపు వైపు అడుగులేస్తోంది.
హోస్ట్ నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నాడు. పూర్తిగా ఇంట్రెస్ట్ జీరో.. అన్నట్టు తయారైంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్.