Switch to English

ప్రచారం ముగిసింది.! పవన్ కళ్యాణ్ ప్రభావమెంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,572FansLike
57,764FollowersFollow

అధికార బీఆర్ఎస్ కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి ఉధృతమైన ప్రచారం వుంటుందని ఊహించలేదు. నిజానికి, మిత్రపక్షం బీజేపీ కూడా జనసేన పార్టీ నుంచి ఇంతటి సహకారాన్నీ, పోరాట పటిమనీ ఊహించి వుండదు.! కాంగ్రెస్ సంగతి సరే సరి.!

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ కాంగ్రెస్ – బీఆర్ఎస్ – బీజేపీ మధ్యన వుంటుందని, కొన్నాళ్ళ క్రితం వరకు ప్రచారం జరిగింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వచ్చేసరికి పోటీ కేవలం కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్యనేనని అంతా అనుకున్నారు.

వాస్తవానికి, కాంగ్రెస్ పార్టీ చాలా ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ‘పోటీ కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్యనే’ అని బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంది. అయితే, చివరికి వచ్చేసరికి ముక్కోణపు పోటీ.. అని తేలింది. ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడిక, ఓట్లను కొనుగోలు చేసే ప్రక్రియకు తెరలేచింది.. అదీ చీకటి వేళ.!

ఎవరు బాగా ఓట్లు కొనుక్కోగలిగితే, వాళ్ళే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలంటూ తెలంగాణ సమాజం ఓ అవగాహనకు వచ్చేసింది. ఈ సందట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, చాలా చాలా ధీమాగా వున్నారు. ‘ప్రచారం బాధ్యతగా చేశాం. సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నించాం. మిత్రపక్షం బీజేపీకి ప్రచారం పరంగా సహకరించాం. ఫలితం ప్రజల చేతుల్లో..’ అంటూ జనసేన నిశ్చింతగా వుంది.

ఓటమి జనసేనకు కొత్త కాదు.! గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన స్కోర్ ‘జీరో’.! కానీ, ఈసారి ఖచ్చితంగా సీట్లు గెలుస్తామనే ధీమాతో వుంది జనసేన. ఓటు బ్యాంకు ఖచ్చితంగా కనిపిస్తుందనే నమ్మకంతో జనసేన శ్రేణులున్నాయి. అది కూడా, డబ్బులు పంచకుండానే.. అన్నది జనసేన వాదన. ఇందులో నిజం లేకపోలేదు.

జనసేన ప్రచారం తాలూకు ప్రభావం, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీల విజయావకాశాల్ని దెబ్బ తీసేలా వుంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావమేంటన్నది డిసెంబర్ 3న తేలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bollywood: ‘హిందీ సినిమాలు చూడటం మానేశా..’ బాలీవుడ్ నటుడి కామెంట్స్

Bollywood: తాను హిందీ సినిమాలు చూడటం మానేసానని ప్రముఖ హిందీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నసీరుద్దీన్ షా (Naseeruddin Shah) చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్...

Varun Tej: ‘పెళ్లయ్యాక ఇలా ఉన్నా..’ వరుణ్ తేజ్ సరదా సమాధానాలు

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు....

సురేఖ కొణిదెల గారు పుట్టిన రోజు సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్’ను ప్రారంభించిన...

అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి...

Rashmika: ‘మృత్యువు నుంచి తప్పించుకున్నాం..’ రష్మిక పోస్టు వైరల్

Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడందో ఆమె భయబ్రాంతులకు గురైంది. ఈ...

Sai Dharam Tej: టైటిల్ వివాదం..! సాయిధరమ్ మూవీకి పోలీసులు నోటీసులు

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గాంజా శంకర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా...

రాజకీయం

Kamal Haasan: ‘2 రోజుల్లో గుడ్ న్యూస్..’ హీట్ పెంచిన కమల్ హాసన్ కామెంట్స్

Kamal Haasan: ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్నారు కమల్ హాసన్. ‘రెండు...

Suman: ‘టీడీపీ-జనసన గాలి వీస్తోంది..’ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Suman: అడపాదడపా రాజకీయాలపై స్పందించే హీరో సుమన్ (Suman) ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ (Tdp)-జనసేన (Janasena) కూటమి గెలుపు ఖాయమని...

వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఏమన్నారు.! వైసీపీ ఎలాంటి దుష్ప్రచారం చేస్తోంది.?

గొడ్డలి వేటుని, గుండె పోటుగా చూపించే ప్రయత్నం చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయమై ఆయన కుమార్తె సునీతా రెడ్డి బలంగా నిలబడటంతో,...

చొక్కాలు మడతబెట్టి.. కుర్చీలు మడతబెట్టి.! ఇదా రాజకీయం.?

ఒకాయన చొక్కాలు మడతబెట్టమంటాడు.. ఇంకొకాయనేమో కుర్చీలు మడతబెట్టమంటాడు.! సినిమాల్లో వ్యవహారం వేరు. నిజానికి, సినిమాల్లోనూ ‘కుర్చీ మడతబెట్టడం’ అనే ప్రస్తావన అత్యంత దిగజారుడుతనం. ‘గురూజీ’ అనే గౌరవం దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...

Janasena: నీకొక్క ఛాన్స్ ఇస్తే.! జనసేన క్యాంపెయిన్ వేరే లెవల్.!

జనసేన పార్టీకి సొంత మీడియా లేదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, జనసైన్యమే జనసేన పార్టీకి ప్రచారాస్త్రం.! పవన్ కళ్యాణ్ అభిమానులే, జనసైనికులు.. ఇందులో దాపరికం ఏముంది.? నిన్న మొన్నటిదాకా అంటే, కేవలం...

ఎక్కువ చదివినవి

పదవీ బాధ్యతలు చేపట్టిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

ఇటీవల జరిగిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలలో వీరశంకర్ ప్యానెల్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసినదే. కాగా ఎన్నికైన నూతన కార్యవర్గం నేడు 16 ఫిబ్రవరి శుక్రవారం, రథసప్తమి...

Rashmika: ‘మృత్యువు నుంచి తప్పించుకున్నాం..’ రష్మిక పోస్టు వైరల్

Rashmika: స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడందో ఆమె భయబ్రాంతులకు గురైంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టా...

Rashmika: ‘రష్మిక’ అరుదైన ఘనత.. ఫోర్బ్స్ జాబితాలో స్థానం

Rashmika: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ రేసులో ముందుంటుంది రష్మిక మందన (Rashmika Mandana). చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. గీత గోవిందం వంటి సూపర్...

Anushka : అనుష్క కోసం ‘శీలావతి’ లాక్‌…!

Anushka : అనుష్క హీరోయిన్‌ గా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ ఇటీవలే ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా చాలా కాలంగా బ్రేక్ తీసుకుని సైలెంట్ గా...

‘సుందరం మాస్టర్’ పెద్ద విజయాన్ని సాధించాలి : మెగ్టాసార్ చిరంజీవి

ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద...