Switch to English

మేటర్‌ సీరియస్‌: తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తున్న కరోనా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటిదాకా ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యింది. అది కూడా, బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తికి ఆ వైరస్‌ సోకింది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ‘కరోనా’ పేరు చెబితేనే వణికిపోతున్నారు. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్‌, కాస్త లేటుగానే తెలుగు నేల మీదకు వచ్చింది. ఖచ్చితంగా వస్తుందని తెలుసు.. కానీ, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోలేకపోయాయా.? అన్న చర్చ జరుగుతోందిప్పుడు.

మన దేశ జనాభా 130 కోట్లు. దేశంలో రద్దీ ప్రదేశాలు కోకొల్లలు. అపరిశుభ్ర ప్రాంతాలకు కొదవే లేదు. వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో మన ప్రమాణాలు చాలా చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి గురించి కొత్తగా చెప్పేదేముంది.? తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా అనుమానిత కేసు వెలుగు చూసింది. ఇప్పటికైతే ఆ వ్యక్తికి కరోనా వైరస్‌ వుందని అధికారిక ప్రకటన రాలేదు. కానీ, అనుమానాలు గట్టిగానే వున్నాయి.

మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? సరిపడా మాస్క్‌లు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో లేని పరిస్థితి. ఇప్పటికిప్పుడు మాస్క్‌లను దిగుమతి చేసుకోవాలన్నా అది సాధ్యమయ్యే పని కాదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రతకి మాస్క్‌ల లభ్యత చాలా తగ్గిపోయింది. వ్యాక్సీన్‌ ఇంకా ఈ వైరస్‌కి అందుబాటులో లేదు. చికిత్స విషయంలో కూడా స్పష్టత లేదు. ‘కరోనా వచ్చినా ప్రమాదం లేదు.. ఎందుకంటే, మరణాల రేటు చాలా తక్కువగా వుంది..’ అని చావు కబురు చల్లగా చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు.

కానీ, కరోనా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. అవును, ప్రాణాలు తీసేయడం సంగతేమోగానీ, కరోనా దెబ్బకి.. ఎక్కడికక్కడ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. దేశాలు సరిహద్దుల్ని మూసేసుకోవాల్సిన దుస్థితి. ఇది ప్రమాద తీవ్రతను చెప్పకనే చెబుతోంది. 2020లో అతి పెద్ద మహమ్మారిగా దీన్ని అభివర్ణించొచ్చు. ఆ మాటకొస్తే, ఇటీవలి కాలంలో ఎంత పెద్ద మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది ఇంకోటి లేదన్నది నిర్వివాదాంశం.

ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ మహమ్మారి దెబ్బకు ఎలా విలవిల్లాడతాయోగానీ, సోషల్‌ మీడియాలో వదంతులు.. మీడియాలో కథనాలు.. ప్రభుత్వాలు చేస్తోన్న హెచ్చరికలతో జనం మాత్రం తల్లడిల్లిపోతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...