Switch to English

కేసీఆర్ వద్దు.. జగనే ముద్దు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

మానుకోట సంఘటన గుర్తుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న సందర్భంలో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళనతో అట్టుడికింది. సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నినాదాలు చేసిన జగన్ రాకను తెలంగాణ ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొండా సురేఖ వంటి నేతలు జగన్ కు అనుకూలంగా ఉండటంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. దీంతో పోలీసులు మధ్యలోనే జగన్ ను అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఇదంతా గతం.

ఇక వర్తమానంలోకి వస్తే.. ఇప్పుడు అదే జగన్ తమకు ముద్దంటున్నారు. తెలంగాణలోని పలు వర్గాల్లో జగన్ కు అనుకూలురు అంతకంతకూ పెరుగుతున్నారు. రైతులకు అందించే సాయం విషయంలోనూ, ఉద్యోగాల భర్తీలోనూ, ఉద్యోగుల ఐఆర్ పెంచడంలోనూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలోనూ జగన్ ను మెచ్చుకుంటూ తమ సీఎం వైఖరిని మాత్రం ఎండగడుతున్నారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు సైతం జగన్ కే జై అంటున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్, ఆర్టీసీ యూనియన్ల మధ్య మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డెక్కి వివిధ రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. కొన్ని చోట్ల ఏపీ సీఎం జగన్ కు పాలాభిషేకం కూడా చేస్తున్నారు. కేసీఆర్ వద్దు.. జగనే మద్దు అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు.

పొరుగు రాష్ట్ర సీఎం జగన్ ను చూసైనా కేసీఆర్ తమ డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఈ పరిణామాలు సహజంగానే కేసీఆర్ కు మంట పుట్టిస్తున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల సీఎంల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ, ఆర్టీసీ కార్మికుల జగన్ అనుకూల నినాదాలు కేసీఆర్ కు అసహనం కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినా.. ఇంకా దానిపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడానికి ఇదే కారణమని అంటున్నారు.

తాజాగా ఏపీఎస్ ఆర్టీసీని మరింత బలోపేతం చేయడానికి రూ.వెయ్యి కోట్లతో 3,677 కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు తెలంగాణలో అదే రోజు 1035 అద్దె బస్సుల కోసం సర్కారు నోటిఫికేషన్ జారీచేసింది. కొత్త బస్సులతో జగన్ తమ ఆర్టీసీని బలోపేతం చేస్తుంటే.. ఇక్కడ మాత్రం అద్దె బస్సులు తీసుకుంటూ సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...