Hanuman : సంక్రాంతి సినిమాల సందడి మొదలు అయ్యింది. ఈ సంక్రాంతికి అయిదు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అయితే చివరి నిమిషంలో తీవ్రమైన పోటీ వద్దు అనే ఉద్దేశ్యంతో రవితేజ ఈగల్ సినిమా ను వాయిదా వేయడం జరిగింది. నేడు హనుమాన్, గుంటూరు కారం విడుదల అయ్యాయి. ఇక సైంధవ్ మరియు నా సామి రంగ సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి.
గుంటూరు కారం సినిమా కోసం దిల్ రాజు భారీ ఎత్తున థియేటర్లు బుక్ చేయడం జరిగిందని, హనుమాన్ కి మినిమం థియేటర్లు కూడా ఇవ్వడం లేదు అనే విమర్శలు వచ్చాయి. హనుమాన్ మేకర్స్ బాహాటంగానే దిల్ రాజు పై విమర్శలు చేసిన విషయం తెల్సిందే.
నేడు విడుదల అయిన గుంటూరు కారం సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అదే సమయంలో హనుమాన్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దాంతో వెంటనే థియేటర్ల సంఖ్య తారు మారు అవుతూనే ఉంది. హనుమాన్ సినిమా కి రెండో షో నుంచే భారీగా థియేటర్లు పెరుగుతున్నాయి.
ఏపీలో పెద్ద ఎత్తున థియేటర్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. రేపటి నుంచి నైజాం ఏరియాలో కూడా హనుమాన్ కి థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.