Anjali : తెలుగు అమ్మాయి అంజలి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. తెలుగు లో కూడా క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ అక్కడ సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అంజలి ప్రేమ పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
గతంలో హీరో జై తో ప్రేమలో ఉన్న అంజలి కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా బిజినెస్ మెన్ తో ప్రేమలో ఉందనే వార్తలు వచ్చాయి. ఇటీవల ఏకంగా అమెరికాలో వ్యాపారవేత్త తో ఫ్యామిలీ పెట్టిందని అంజలి గురించి పుకార్లు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో అంజలి స్పందించాల్సి వచ్చింది.
అంజలి తాజాగా ప్రేమ మరియు పెళ్లి విషయమై స్పందించింది. తన ప్రేమ మరియు పెళ్లి విషయం గురించి మీడియాలో పదే పదే వార్తలు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాకు తెలియకుండానే నాకు చాలా సార్లు పెళ్లి చేశారు అంటూ అంజలి అసహనం వ్యక్తం చేసింది. పెళ్లి వార్తలు, అమెరికాలో ఫ్యామిలీ వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకుంటే తప్పకుండా నేనే మీడియాకు తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చింది.
This is a topic that is close to my heart… Cheers!
Where are your contact details though?
Hey there! Would you mind if I share your blog with my zynga group?
There’s a lot of people that I think would really appreciate your content.
Please let me know. Cheers