విజయవాడ లో ఎన్నికల ప్రచారం కోసం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సిద్ధమవుతుండగా, తెలుగు తమ్ముళ్ళ కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. బెజవాడ టీడీపీలో కమ్మ వర్సెస్ కాపు ఫైట్ కొత్త మలుపు తిరిగింది. వంగవీటి రంగా హత్య కేసు నిందితుల్ని ఎంపీ కేశినేని నాని వెంటేసుకు తిరుగుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావు. వీరికి మరో టీడీపీ నేత నాగుల్ మీరా కూడా వంతపాడుతున్నారు.
టీడీపీకి బీసీలు వెన్నెముక అనీ.. అలాంటి బీసీల్ని అణగదొక్కాలని కేశినేని నాని చూస్తున్నారని నాగుల్ మీరా ఆరోపిస్తే, కేశినేని నాని కాళ్ళు విరగ్గొడతానని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ‘కేశినేని శ్వేతను మేయర్గా గెలిపించుకుంటాం.. ఆమె కేశినేని కుమార్తెగా కాదు.. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.. చంద్రబాబు ఆమెకు అవకాశం కల్పించారు..’ అంటున్నారు బొండా ఉమామహేశ్వరరావు.
ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ‘కేశినేని నానిని తిడితే టీడీపీకి నష్టం కాదు.. నాలుగు ఓట్లు ఎక్కువే వస్తాయి పార్టీకి..’ అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించడం. గతంలో కేశినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న ఫైట్ పలు సార్లు చూశాం. ‘కొబ్బరి చిప్పల దొంగలు’ అనే ఆరోపణల్నీ ఇరువురిపైనా విన్నాం. ఇంత గొప్పగా తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ళ మధ్య సఖ్యత వుంటే పార్టీ ఎలా బాగుపడుతుంది.?
పార్టీ భ్రష్టుపట్టిపోతున్నా, నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేయడంలేదు. నిజానికి, చంద్రబాబు ఎవర్నీ కంట్రోల్ చేయలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా కేశినేని నాని ఏం చేసినా, ఆఖరికి తనను విమర్శించినా చంద్రబాబు సర్దుకుపోవాల్సి వస్తోంది. ఎందుకంటే, కేశినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో వైసీపీలోకి దూకేందుకు, బీజేపీలోకి దూకేందుకు పలుమార్లు ప్రయత్నించారు, ప్రయత్నిస్తూనే వున్నారు.
113818 524993Yay google is my king helped me to uncover this fantastic internet web site ! . 900154
26992 658719The post posted was extremely informative and valuable. You individuals are doing a great job. Keep going. 624981
231092 658654Thanks for the post. I like your writing style – Im trying to start a blog myself, I think I may well read thru all your posts for some suggestions! Thanks once more. 823710
672229 732142Ive read several excellent stuff here. Undoubtedly value bookmarking for revisiting. I surprise how considerably effort you put to create one of these superb informative web site. 395331