Switch to English

అమరావతి వ్యధ: టీడీపీ, వైసీపీ.. ఎందుకీ కట్టు కథ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

అమరావతి పేరుతో లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందట. ఇది వైసీపీ చేస్తోన్న ఆరోపణ. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.. అర్థ రూపాయి అయినా ఈ కుంభకోణానికి సంబంధించి వెనక్కి రప్పించగలిగిందా వైసీపీ.? అన్న ప్రశ్నకు సమాధానమే లేదు, వుండదు కూడా.

కొన్నాళ్ళ క్రితం టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై ఈఎస్ఐ మెడికల్ స్కాం ఆరోపణలు వచ్చాయి. కేసులు నమోదయ్యాయి. ఏమయ్యింది ఆ కేసు.? వెయ్యి కోట్ల కుంబకోణమన్నారు, వెయ్యి రూపాయలన్నా వెనక్కి వచ్చిందా.? లేదు, రాదు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులోనూ ఇంతే.

అసలు విషయానికొద్దాం.. అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరించిందన్నది వైసీపీ ఆరోపణ. అధికారంలోకి వస్తూనే అమరావతిపై నానా రకాలుగా విచారణ చేశారు. కొండను తవ్వి ఎలకని పట్టిన చందంగా.. అని కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే, ఆ ఎలక కూడా ఇప్పటిదాకా దొరకలేదిక్కడ. కానీ, అమరావతి పేరుతో రాజకీయాలు మాత్రం నిస్సిగ్గుగా జరుగుతున్నాయి.

దళిత రైతుల నుంచి భూముల్ని అప్పటి అధికార పార్టీ పెద్దలు కాజేశారన్నది వైసీపీ ప్రభుత్వ ఆరోపణ. కేసులు నమోదయ్యాయి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి నోటీసులూ వెళ్ళాయి. ఎవరైతే తనకు ఫిర్యాదు చేశారని వైసీపీ ఎమ్మెల్యే చెబుతున్నారో, ఆ రైతులు ‘పోలీసులు మాకు విషయం చెప్పకుండా మా నుంచి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు.. అవి, చంద్రబాబు మీద కేసులు పెట్టడానికని మాకు తెలియదు..’ అని కొందరు దళితులు చెప్పిన వైనాన్ని ‘స్టింగ్ ఆపరేషన్’ ద్వారా టీడీపీ బయటపెట్టింది.

నిజానికి, ఇది చాలా సీరియస్ అంశం. ఏపీ సీఐడీ ఈ విషయమై లోతుగా విచారణ జరపాలి. టీడీపీ స్టింగ్ ఆపరేషన్ తప్పయితే, టీడీపీపై చర్యలు తీసుకోవాలి. లేదూ, పోలీసులే బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారన్నది నిజమైతే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు పెట్టాల్సింది దళితులైతే, వారి తరఫున ఎమ్మెల్యే కేసు పెట్టడమే ఈ కేసులో పస లేదన్న విషయాన్ని తేటతెల్లం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే అమరావతి చుట్టూ కట్టు కథలు అల్లబడుతున్నాయన్నది నిర్వివాదాంశం. ఓ ప్రాంతం, అందులో ప్రజలు.. వీళ్ళంతా రాష్ట్రానికి చెందినవారే. ఓ ప్రాంతంపై రాజకీయ కుట్ర.. అది ఏ పార్టీ చేసినా అది క్షమార్హం కాదు. అవినీతి జరిగితే, ఆ మొత్తాన్ని వెనక్కి లాక్కొచ్చి.. రాష్ట్ర ప్రజలకు పంచాల్సిందే. కానీ, ఇక్కడ టీడీపీ – వైసీపీ రాజకీయాన్ని పంచుకుంటున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...