‘స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ – వైసీపీ మధ్య ఒప్పందాలు జరిగాయి..’ అంటూ గతంలోనే ప్రచారం జరిగింది. ఇది ఉత్త ప్రచారం మాత్రమే కాదు, ముమ్మాటికీ నిజం. ‘అధికారంలో మీరున్నారు కాబట్టి, మీరే మెజార్టీ గెలుచుకోండి.. మా పరువు కాపాడుకుంటాం మాకు కొన్ని వదిలెయ్యండి..’ అంటూ టీడీపీ, వైసీపీని వేడుకుంది. తద్వారా చాలా చోట్ల టీడీపీ, రెండో స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. కింది స్థాయిలో టీడీపీ – వైసీపీ లాలూచీల్ని జనం గమనించారు మరి. అందుకే, అనూహ్యంగా జనసేన పార్టీ పుంజుకుంది.
సాక్షాత్తూ ఓ మంత్రిగారు తన నియోజకవర్గ పరిధిలో టీడీపీ అసలు పోటీనే చేయలేదనీ, జనసేనకు ఓ సామాజిక వర్గం ఓట్లు కలిసొచ్చాయనీ చెప్పుకున్నారు. అక్కడ టీడీపీతో వైసీపీ లాలూచీ పడినా జనసేన గెలవడం సదరు మంత్రిగారికే షాకిచ్చింది. ఇక, చంద్రబాబు అను‘కుల’ మీడియాకి చెందిన బూతు కిట్టు, రాష్ట్రంలో దిగజారిపోయిన రాజకీయాల గురించి సుదీర్ఘంగా తన ఆత్మకథ రాసుకున్నారు.
చంద్రబాబుకి ఎలా జాకీలేసి లేపాలో తెలియక తంటాలు పడుతున్న బూతు కిట్టు, ఈసారి ధైర్యం చేసి.. చంద్రబాబుకి ఉచిత సలహాలు గట్టిగానే ఇచ్చేశారు. చంద్రబాబు తన ప్రవర్తన మార్చుకోవాలంటూ క్లాస్ తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ – వైసీపీ ఎలా ఒప్పందాలు చేసుకున్నదీ సవివరంగా పేర్కొన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్ళి వచ్చేస్తే మంచిదన్నారు. ఇంకేవేవో ఉచిత సలహాలు ఇచ్చేశారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ చేయాల్సిన పనేనా ఇది.?
అయితే, బూతు కిట్టు ఓ రకంగా రాష్ట్రానికి మంచే చేశాడు. అదేంటంటే, టీడీపీ – వైసీపీ పొత్తు గురించి స్పష్టంగా పేర్కొనడం. అదేంటీ, టీడీపీ – వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు కదా.? అంటే, రాష్టంలో మూడో పార్టీ అనేది వుండకూడదు గనుక, వైసీపీ – టీడీపీ ఎంతకైనా తెగిస్తాయని జనం అనుకుంటున్నదే.. అదే బూతు కిట్టు మాటల్లో స్పష్టమయ్యింది.
టీడీపీతో జనసేన కుమ్మక్కు.. వైసీపీతో జనసేన కుమ్మక్కు.. అంటూ దాదాపు ఏడేళ్లుగా చెత్త కథనాలు రాస్తూనే వుంది ఇటు టీడీపీ అను‘కుల’ మీడియా, అటు వైసీపీ అను‘కుల’ మీడియా. ఇప్పుడు బహిరంగ రహస్యం బట్టబయలయ్యింది. టీడీపీ – వైసీపీ కలిసి రాష్ట్రాన్ని పంచుకుంటున్నాయని సాక్షాత్తూ బూతు కిట్టునే ప్రకటించేశాడు.
World wide, the game offers diverse meanings, but also for
the functions of the guide, the meaning addressed will
be that of Pinto Banco baccarat.