Switch to English

‘మీ టూ’ 2.0: బాలయ్య హీరోయిన్‌ మళ్ళీ వచ్చింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నందమూరి బాలకృష్ణ సరసన ‘వీరభద్ర’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్‌ భామ తనూశ్రీ దత్తా సినిమాల్లో హీరోయిన్‌గా సాధించిన పాపులారటీని మించి ‘మీ టూ’ ఆరోపణలతో దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ సంపాదించింది. తనూశ్రీ దత్తా దెబ్బకి నానా పటేకర్‌లాంటి బాలీవుడ్‌ మేటి నటుడు సినిమా అవకాశాల్ని కోల్పోవల్సి వచ్చింది. అంతేకాదు తనూశ్రీ తీసుకొచ్చిన ఊపుతో వివిధ రంగాల్లోని మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై గళం విప్పగలిగారు. అలా తనూశ్రీ దత్తా పేరు దేశమంతా మార్మోగిపోయింది.

గత కొంత కాలంగా సైలెంట్‌ అయిన తనూశ్రీ దత్తా ఈ సారి సరికొత్తగా సంచలనాలకు సిద్ధమైంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌పై సంచలన ఆరోపణలు చేసింది తనూశ్రీ దత్తా. అజయ్‌ దేవగణ్‌ తాజా సినిమాలో సీనియర్‌ నటుడు అలోక్‌ నాధ్‌ నటించడమే ఈ వివాదానికి కారణం. అలోక్‌ నాధ్‌పై వింటానంద అనే మహిళ గతంలో లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఓ మహిళను లైంగికంగా వేధించిన అలోక్‌నాధ్‌ని అజయ్‌దేవగణ్‌ తన సినిమాలోకి తీసుకోవడమంటే, పరోక్షంగా అజయ్‌ దేవగణ్‌ లైంగిక వేధింపుల్ని సమర్ధిస్తున్నట్లేనని భావించాలంటూ తనూశ్రీ దత్తా ఆరోపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలోక్‌ నాధ్‌ మాత్రమే కాదు, పలువురు బాలీవుడ్‌ నటులు, ఈ లైంగిక ఆరోపణల కారణంగానే పలు సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు. అది మీటూ ఉద్యమం ఉధృతంగా నడిచిన రోజుల్లో. కానీ ఆ ఉద్యమం కొంత చల్లారేసరికి ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు.

ఈ సమయంలో మరోసారి తనూశ్రీ ప్రకంపనలు హిందీ సినీ పరిశ్రమని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. తనూశ్రీదత్తా ఎప్పుడు ఎవరిపై ఎలాంటి బాంబ్‌ పేలుస్తుందో తెలియక గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నవారూ, వారికి అవకాశాలు ఇస్తున్నవారూ బిక్కు బిక్కుమంటున్నారు. సోషల్‌ మీడియా కారణంగా ఏ అంశాన్నీ ఇప్పుడు మభ్యపెట్టలేని పరిస్థితి నెలకొంది. అందునా మీటూ ఉద్యమం ఓ కేంద్రమంత్రితో తన పదవికి రాజీనామా చేయించింది. దాంతో మీటూ ఉద్యమాన్ని ఇప్పుడెవరూ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. తమిళ సినీ పరిశ్రమలో ఇప్పటికీ మీటూ ప్రకంపనలు కనిపిస్తూనే ఉన్నాయి. గాయని చిన్మయి, సీనియర్‌ రచయిత వైర ముత్తు మధ్య ఇంకా ఆ వివాదం నడుస్తూనే ఉంది.

కన్నడ నటి శృతి హరిహరన్‌, యాక్షన్‌ కింగ్‌ గా పేరొందిన తమిళ నటుడు అర్జున్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణల నేపథ్యంలో అర్జున్‌పై కేసు నమోదవడం తెలిసిన విషయమే. తెలుగు సినిమా విషయానికి వస్తే, శ్రీరెడ్డి చేసిన ఆందోళన ఫలితంగా తెలంగాణా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా జీవో జారీ చేసింది. పలువురు మహిళా సినీ ప్రముఖులు ఈ కమిటీలో చోటు దక్కించుకున్నారనుకోండి, అది వేరే సంగతి.

చెప్పుకుంటూ పోతే మీటూ ప్రకంపనలు వాటి ఫలితాలు చాలా కనిపిస్తాయి. తాజా పరిణామాలపై తనూశ్రీ దత్తా మాట్లాడుతూ గతంలో తాను నడిపిన పోరాటానికి పదింతల ఉత్సాహం జోడించి, సరికొత్త పోరాటం చేయబోతున్నాననీ ఈసారి చేయబోయే సుదీర్ఘ పోరాటం మహిళలకు వర్క్‌ ప్లేస్‌లో సమస్యలే లేకుండా చేస్తుందనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....