Switch to English

గెలిచినా ఓడినా రోజాకి మంత్రి పదవి ఖాయమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో గెలిచిన రోజా ఈ సారి కూడా ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసి బ్యాలెట్‌ బాక్స్‌లో ప్రజా తీర్పు నిక్షిప్తమైంది కనుక, కౌంటింగ్‌ రోజునే ఎవరి జాతకాలు ఏంటో తెలుస్తాయి. మామూలుగా అయితే పోటీ చేసిన అభ్యర్ధులకు గెలుపు, ఓటములపై విపరీతమైన ఆందోళన ఉంటుంది. రోజా ఇందుకు అతీతమేమీ కాదు. కానీ ఆమె ధీమాగా కనిపిస్తున్నారు. కారణమేంటంటే అధికార పార్టీ సర్వేలో కూడా రోజా గెలుస్తారని తేలిందట.

వాస్తవానికి ప్రీ పోల్‌ అంచనాలు రోజాకి వ్యతిరేకంగా వచ్చాయట. పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ప్రభావం రోజాకి మైనస్‌గా మారుతుందని కొన్ని విశ్లేషణలు వినిపించాయి. దాంతో అప్పట్లో రోజా కూడా కొంత ఆందోళన చెందారు. తన వాస్తవ వ్యవహార శైలికి భిన్నంగా ఎన్నికల ప్రచారంలో సరికొత్తగా కనిపించారు రోజా. అనవసర రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా హుందాగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్లీన్‌గా ఎన్నికల ప్రచారంలో అందరి మెప్పునూ పొందిన నేతగా రోజా గురించి అంతా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ఎన్నికల కంటే చాలా ముందే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోజాకి ప్రత్యేకమైన భరోసా ఇచ్చారట. ఆ ప్రత్యేకమైన భరోసా ఏంటంటే మంత్రి పదవి అనీ సమాచారమ్‌. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావజాలాన్ని చాలా గట్టిగా వినిపించడంలో రోజా తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ క్రమంలో అధికార తెలుగు దేశం పార్టీ నుండి ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటలో చెప్పాలంటే, అధికార పార్టీ వేధింపులకు తీవ్రంగా ఇబ్బంది పడిన వైసీసీ నేతల్లో వైఎస్‌ జగన్‌ మొదటి ప్లేస్‌లో ఉంటే, రెండో ప్లేస్‌ రోజాదే.

రోజా పట్ల ఉన్న నమ్మకం, పార్టీ కోసం ఆమె పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో వైఎస్‌ జగన్‌ ఆమెకు మంత్రి పదవిపై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా గెలిచినా, ఓడినా పదవి ఖాయమనే భరోసా ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే, ఓడినా అన్న చర్చకే ఆస్కారం లేదనీ మెజార్టీ గురించి తప్ప ఇంకో ఆలోచనే తమకు లేదనీ రోజా గెలుపుపై వైసీపీ నేతలు అంటున్నారు. గడచిని ఐదేళ్లలో అధికార పార్టీపై రాజకీయ పోరాటం చేస్తూనే, నియోజక వర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం ప్రదర్శించలేదామె.

గతంలోకి తొంగి చూస్తే తెలుగు దేశం పార్టీ హయాంలోనే రోజాకి మంత్రి పదవి దక్కాల్సి ఉంది. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పని చేశారామె. అయితే ఎమ్మెల్యేగా ఆమె గెలవలేకపోయారు. టీడీపీ నేతలే తనకు అడ్డు పడ్డారని అప్పుడూ ఇప్పుడూ ఆరోపిస్తూంటారు రోజా. ఎమ్మెల్సీ పదవిని ఒప్పుకుంటే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అప్పట్లో మభ్యపెట్టారు. కానీ రోజా అందుకు ససేమిరా అన్నారు. ఎలాగైతేనేం ఇన్నేళ్ల కష్టం ఆమెకు సత్ఫలితాన్నిస్తే మంచిదే కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...