ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం వెనుక కథ చాలా కాలంగా సాగుతోందా? వైఎస్సార్సీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై కసరత్తు మొదలైందా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవహారంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి సూచనలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
మొన్నటి ఎన్నికలు ముందు, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో స్వామీజీల పరపతి బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో స్వరూపానంద స్వామి, తెలంగాణలో చినజీయర్ స్వామి ఆశీస్సులు లేకుండా ఇద్దరు సీఎంలు ఏ పనీ చేయడంలేదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే జగన్ మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖ వెళ్లి స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్నారు. ఆ సందర్భంగానే రాజధాని వ్యవహారానికి బీజం పడినట్టు తెలుస్తోంది.
గతంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడు పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. భౌగోళికంగానూ, వాస్తుపరంగా అది అంత మంచి ప్రదేశం కాదని పేర్కొన్నారు. పైగా అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా వాస్తుకు విరుద్ధంగా ఉందని అప్పట్లోనే పలువరు వాదించారు. అలా వ్యతిరేకించినవారిలో స్వరూపానంద కూడా ఉన్నారు.
పైగా ఆయన పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు కూడా చేశారు. వాస్తుకు విరుద్ధం కావడం వల్లే అమరావతి అడుగు ముందుకు పడటంలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్ అధికారంలోకి రావడం.. స్వరూపానంద ఆయనకు పలు సూచనలు చేయడం.. అప్పటికే అమరావతిపై వైసీపీ అధినేత కూడా సుముఖంగా లేకపోవడం వంటి అంశాలు రాజధాని మార్పునకు శ్రీకారం చుట్టాయి.
విశాఖ నుంచి పాలన జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని పలువురు చెప్పడంతో జగన్ ఆ దిశగా ఆలోచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పాలనకు గుండెకాయ వంటి సచివాలయాన్ని విశాఖకు తరలించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీకి మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చినట్టు చెబుతున్నారు.
297583 18177An intriguing discussion is worth comment. I feel that you really should write a lot more on this subject, it might not be a taboo subject but normally men and women are not enough to speak on such topics. To the next. Cheers 810502
348790 36399Hello fellow internet master! I really enjoy your internet site! I liked the color of your sidebar. 738398
134381 73093Aw, this became an incredibly nice post. In thought I would like to devote writing such as this moreover – taking time and actual effort to make a quite excellent article but exactly what do I say I procrastinate alot and by no indicates discover a way to get something completed. 232756
264619 189668I was reading some of your content on this website and I conceive this internet site is actually informative ! Keep on putting up. 239038
618487 996366Appreciate it for helping out, superb data. 963723