సైరా నరసింహారెడ్డి వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన సురేందర్ రెడ్డి దాదాపు ఏడాది కాలం నుండి తన తర్వాతి చిత్రం చిత్రాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు. సైరా మిగిలిన భాషల్లో అంతగా ఆడకున్నా, తెలుగులో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. సురేందర్ టేకింగ్ కు కూడా అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభించాయి.
అయితే సురేందర్ కు మాత్రం తర్వాతి చిత్రం విషయంలో కష్టాలు తప్పలేదు. మహేష్ బాబుకు స్క్రిప్ట్ చెప్పాడు, నచ్చింది కానీ మహేష్ ఫ్రీ అవ్వడానికి మరో రెండేళ్లు పడుతుంది. ప్రభాస్ విషయంలో కూడా ఇంతే. రామ్ తో సినిమా చేద్దామని చూసినా కుదర్లేదు. అయితే ఎట్టకేలకు సురేందర్ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
సురేందర్ రెడ్డి లేటెస్ట్ గా అఖిల్ కు స్క్రిప్ట్ ను నరేట్ చేసాడట. అఖిల్ కు అది తెగ నచ్చేయడంతో వెంటనే సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడట. నాగార్జున వైపు నుండి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయంలా కనిపిస్తోంది.
దర్శకుడు క్రిష్ తన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ కాంబినేషన్ గురించి ఎప్పటినుండో వార్తలు వస్తున్నా రీసెంట్ గా ఈ సినిమాకు అన్నీ కుదిరి ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.
747527 483654Every email you send ought to have your signature with the link to your web web site or weblog. That generally brings in some visitors. 140883
187906 756479I like this post a whole lot. I will definitely be back. Hope that I will probably be able to read far more insightful posts then. Will probably be sharing your information with all of my associates! 431641
644487 464336Finally, got what I was seeking for!! Ive truly enjoying every small bit of this. Ecstatic I stumbled into this post! and also Ive bookmarked to appear at special info for your blog post. 429942
732253 936052 Its hard to locate knowledgeable people on this subject, but you sound like you know what you are talking about! Thanks 553792