Shilpa Shetty: బాలీవుడ్ (Bollywood) సెలబ్రిటీ జంట రాజ్ కుంద్రా (Raj Kundra)-శిల్పాశెట్టి (Shilpa Shetty) విడిపోతున్నారా..? ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన ఎక్స్ ఖాతాలో ‘మేం విడిపోతున్నాం.. ఈ విపత్కర పరిస్థితుల్లో మీరంతా మాకు మద్దతుగా నిలవాల’ని రాజ్ కుంద్రా ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
పోస్టులో ఎక్కడా శిల్పాశెట్టి పేరు లేకపోవడమూ చర్చనీయాంశమైంది. ఇటివల ఆయన ఎక్కువగా మాస్క్ ధరించి కనిపిస్తున్నారు. దీంతో.. రాజ్ కుంద్రా మాస్క్ తీసేస్తున్నారనుకుంటా.. అందుకే విడిపోతున్నామని చెప్తున్నారని కొందరు.. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ కూడా యాడ్ చేయడంతో వివాహబంధంలోనే అని మరికొందరు అంటున్నారు. అయితే.. శిల్పాశెట్టి సోషల్ మీడియా ఖాతాల్లో దీనిపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఆసక్తిగా మారింది.
రెండేళ్ల క్రితం నీలి చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా ప్రస్తుతం యూటీ 69 అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ శిల్పాశెట్టి పోస్ట్ చేయడం విశేషం. జైల్లో ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితులను యూటీ69లో చూపబోతున్నారని తెలుస్తోంది.
My family members always say that I am wasting my time here at web, but I know I am getting experience daily by reading such nice articles or reviews.
I got this web page from my pal who informed me about this site and now this
time I am visiting this site and reading very informative
content here.