ప్రపంచంలో ఎక్కువ క్రేజ్ ఫుట్ బాల్ సొంతం. సాకర్ ఫుట్ బాల్ ఈవెంట్ అయితే మరీను. ఈక్రమంలో యావత్ ప్రపంచం ఖతార్ లో జరుగుతున్న ఫుట్ బాల్ ఫీవర్ తో ఊగిపోతుంది. ఇప్పుడీ ఈవెంట్ ముగింపుకు వచ్చింది. ఆదివారం జరుగే ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటినా-ఫ్రాన్స్ తలపడుతున్నాయి. అయితే.. ఇప్పుడు అర్జెంటినాకు సంబంధించి నెట్టింట సరదా చర్చ నడుస్తోంది.
ఇందుకు కారణం అర్జెంటినా జాతీయ జెండా రంగు, అర్జెంటినా ఆటగాళ్ల జెర్సీ మన ఎస్బీఐ పాస్ బుక్ రంగునే పోలి ఉండటం ఇందుకు కారణం. ఇందుకే భారతీయులు అర్జెంటినా గెలవాలని కోరుకుంటున్నారు అంటూ రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఎస్బీఐ అర్జెంటినాకు అఫీషియల్ స్పాన్సర్.., ఫైనల్ మ్యాచ్ సమయంలో అర్జెంటీనా జెండా దొరక్కపోతే ఎస్బీఐ పాస్ బుక్ తో మద్దతివ్వండి.., అర్జెంటీనాను ఎందుకు ఇష్టపడుతున్నామంటే.. ఎస్బీఐనే కారణం అంటూ ఫన్నీ మీమ్స్ సందడి చేస్తున్నాయి. ఆదివారం జరిగే ఫైనల్ విజేత కోసం సాకర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Being an SBI passbook holder, is it ok if I support France in the final?
Oh wait…..I am not french either.#FIFA#WorldCup #FIFAWorldCupQatar2022 pic.twitter.com/cFu3BuzwOo— मकरंद (Makrand) (@makrand_san) December 15, 2022
The reason why Indians are supporting Argentina 🇦🇷 pic.twitter.com/YAYBsI58dW
— Dr Shobha (@DrShobha) December 15, 2022