కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగమార్తాండ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ని రంగమార్తాండ సినిమా కోసం ఇవ్వడం జరిగింది. అదే సమయంలో దర్శకుడు కృష్ణవంశీతో కొద్ది సమయం ముచ్చటించారు. ఆ సమయంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజా గురించిన ప్రస్తావన వచ్చింది.
ఇద్దరి మధ్య ఇళయరాజా ప్రస్తావన వచ్చిన సమయంలో ఒక సంగీత దిగ్గజం అంటూ చిరు మాట్లాడుతున్నారు. ఈ సినిమాకు వాయిస్ ఎవరు చెప్తున్నారు అంటూ ఇళయరాజా ప్రశ్నించిన సమయంలో కృష్ణవంశీ స్పందిస్తూ చిరంజీవి గారు అంటూ సమాధానం ఇచ్చాడట.
ఆ లైన్ చిరంజీవి గారు పాడిన తర్వాత సంగీతం చేద్దాం.. ఆయన అభిప్రాయం చెప్పించి.. ఆ తర్వాత సంగీతం జత చేద్దాం అంటూ చిరంజీవి పై ఉన్న గౌరవాన్ని చూపించాడట. అదే సమయంలో సంగీతం కోసం ఇళయరాజా చాలా విభిన్నంగా ప్రయత్నించారని చిరంజీవి అన్నారు.
అప్పటి కాలం నాటి సంగీత వాయిద్యాలను మాత్రమే ఉపయోగించి ఏ ఒక్క ఎలక్ట్రానిక్ వాయిద్యాన్ని ఉపయోగించకుండా అద్భుతంగా సంగీతాన్ని ఇళయరాజా అందించారని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో రాబోతున్న రంగమార్తాండ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది మరాఠీ సినిమా నట సామ్రాట్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బ్రహ్మానందం విభిన్నమైన పాత్రను పోషించాడు. అంతే కాకుండా రమ్యకృష్ణ మరియు ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివత్మిక ఇలా ఎంతో మంది నటీనటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.. చిరంజీవి వినిపించబోతున్నారు. దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
569823 136438Im so pleased to read this. This is the kind of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this finest doc. 470251
657835 110977Wow, cool post. Id like to write like this too – taking time and real effort to make a excellent article but I procrastinate too significantly and never appear to get started. Thanks though. 902465