స్టార్ హీరోయిన్ సమంత సామ్ జామ్ షో మెల్ల మెల్లగా ప్రేక్షకుల ఆధరణ దక్కించుకుంటూ ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సామ్ జామ్ కార్యక్రమంకు వరుసగా స్టార్స్ వస్తున్నారు. గత వారం చిరంజీవి గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ను ప్రీమియర్ చేసిన ఆహా వారు కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1వ తారీకున అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరు అయిన షో ను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే షో కు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. తాజాగా షో ప్రోమో కూడా విడుదల అయ్యింది.
సామ్ జామ్ షో లో అల్లు అర్జున్ అనగానే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే మంచి కంటెంట్‌ను సమంత ఇవ్వబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. ఫుల్ ఫన్ ను ఈ ఎపిసోడ్ లో సమంత ఇవ్వనుంది. షో కు ముందు అల్లు అర్జున్ తనయుడు అయాన్ తో సమంత ఫోన్ లో మాట్లాడింది. మా నాన్నను ఒక ప్రశ్న అడగండి అంటూ సమంతకు అయాన్ చేప్పడం కాస్త ఆసక్తికరంగా మారింది.
ఇక అల్లు అరవింద్ కూడా షో లో రావడం మరింత హైలైట్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు బాగా హార్డ్ వర్కింగ్ మరి చిన్నప్పటి నుండి కూడా ఇలాగే ఉండేవాడా అంటూ సమంత అడుగగా అందుకు అల్లు అరవింద్ దండం పెట్టి కాదు అన్నట్లుగా ఫన్నీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. అప్పుడు అంత సీన్ లేదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. జనవరి 1, 2021లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.
"Fans' Love is Unconditional ♥"
Here's a glimpse of #SamJam with Stylish Star @alluarjun.Full episode premieres 01.01.2021 #SamJamWithAA #AlluArjun @Samanthaprabhu2 #AlluAravind @thesamjamshow pic.twitter.com/Jha08LUHe8
— ahavideoIN (@ahavideoIN) December 27, 2020
185564 115725Thanks for helping out, superb information . 405668
696328 37309Exceptional read, I lately passed this onto a colleague who has been performing slightly research on that. And the man in fact bought me lunch because I came across it for him smile So allow me to rephrase that: Appreciate your lunch! 551930