Switch to English

పవర్‌ స్టార్‌: ఆర్జీవీ పబ్లిసిటీ పైత్యానికి పరాకాష్ట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఒకప్పటి సెన్సేషనల్‌ డైరెక్టర్‌ కాస్తా, ఇప్పుడు పబ్లిసిటీ కింగ్‌ అయిపోయారు. ఎవరి మీద కామెంట్లు వేస్తే, కావాల్సినన్ని తిట్లు ఉచితంగా వస్తాయో వర్మకి బాగా తెలుసు. అందుకే, ఎక్కువగా జనసేన అధినేత, సినీ నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మీద కామెంట్లు వేస్తుంటాడు. వైఎస్సార్సీపీ అండదండలతో తెలుగుదేశం పార్టీ మీద సెటైర్లు వేయడం.. తద్వారా పబ్లిసిటీ పొందడం వర్మకి అలవాటే. టీడీపీ సంగతి పక్కన పెడితే, ‘పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమానిని..’ అని చెప్పుకుంటూనే, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో ఎలా తిట్టించుకోవాలన్న విషయమై మాస్టర్‌ డిగ్రీ చేసేసినట్లు వ్యవహరిస్తుంటాడు ఆర్జీవీ.

ఇదిగో, ఈ క్రమంలోనే ‘పవర్‌ స్టార్‌’ అనే ఓ సినిమా రూపొందిస్తున్నాడు. దీన్ని సినిమా అనాలా.? ఇంకేమన్నా అనాలా.? షార్ట్‌ ఫిలింకి ఎక్కువ.. సినిమాకి తక్కువ.. అనాలేమో. ‘పవర్‌ స్టార్‌’ అంటూ పవన్‌ కళ్యాణ్‌ని పోలి వుండే ఓ క్యారెక్టర్‌ని సృష్టించి, పవన్‌ కళ్యాణ్‌ మీద తీస్తున్నాడు వర్మ ఈ సినిమా లాంటిదాన్ని. కొత్తగా ‘పే ఫర్‌ వ్యూ’ కాన్సెప్ట్‌లో జోరు పెంచిన వర్మ, ఆ కాన్సెప్ట్‌లోనే ఈ ‘పవర్‌స్టార్‌’ని కూడా విడుదల చేస్తాడట. ‘పవర్‌స్టార్‌’ ఫస్ట్‌ లుక్‌తోపాటు కొన్ని ఫొటోలూ విడుదల చేశాడు ఈ పబ్లిసిటీ కింగ్‌. వీటిల్లో చిరంజీవిని పోలి వుండే పాత్ర కూడా కన్పించడం గమనార్హం. వర్మ ఏ స్థాయికి దిగజారిపోయాడో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే.. అని స్వయానా ఆయన అభిమానులే సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌ అనుకునే నైజం వర్మది. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమా తీసి, అందులో వర్మ తన పైత్యాన్ని ఏ స్థాయిలో చూపాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరికి ఆ సినిమా రిజల్ట్‌ ఏంటో అందరికీ తెల్సిందే. నిజానికి, వర్మకి సినిమా రిజల్ట్‌తోనూ సంబంధం లేదు. అందుకే ఆయన్నుంచి ఫ్లాపుల మీద ఫ్లాపు సినిమాలొస్తుంటాయి. ఫ్లాపులు, హిట్లు సినిమా కెరీర్‌లో ఎవరికైనా తప్పవుగానీ, సినిమా సినిమాకీ స్థాయిని దిగజార్చుకోవడమంటే బహుశా అది వర్మకే చెల్లుతుందేమో. ఇంతకీ ఈ ‘పవర్‌స్టార్‌’ సినిమాకి స్పాన్సర్‌ ఎవరంట.? తెరవెనుక వర్మని ఎంకరేజ్‌ చేస్తోన్న ఆ ‘నీలి’ నీడ ఎవరంట.? ఏమోగానీ, సినిమా రిలీజయ్యేదాకానే హంగామా.. ఆ తర్వాత వర్మనిగానీ, ఆ సినిమానిగానీ ఎవరూ పట్టించుకునే పరిస్థితి వుండదు. ఈలోగా అవతలివాళ్ళ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయాలనే ‘కసి’తో వర్మ తన పైత్యాన్ని ఇలా ప్రదర్శింటాడంతే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...