Switch to English

రాయపాటి తీగ లాగేది ఆయన డొంక కదిలించడానికేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బ్యాంకు రుణం ఎగవేసిన కేసులో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసం, కార్యాలయాల్లో సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. పైకి బ్యాంకు రుణాల ఎగవేత అని చెబుతున్నా.. అంతర్గతంగా ఈ దాడుల లక్ష్యం వేరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్థిక మూలాలను పెకిలించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ మేరకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని చెబుతున్నారు.

గత ఎన్నికల ముందు బీజేపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ప్రధాని మోదీ లక్ష్యంగా చంద్రబాబు తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపైనా ఆరోపణలు చేశారు. పైగా అప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చంద్రబాబు.. ఆ పార్టీకి భారీ మొత్తంలో ఆర్థిక సాయం కూడా చేశారనే వ్యాఖ్యలు వినిపించాయి. బీజేపీని ఓడించడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చంద్రబాబు చేయడం కమలథానులకు ఆగ్రహం కలిగించింది. దీంతో ఎన్నికలకు ముందే టీడీపీకి ఆర్థికంగా అండగా నిలిచేవారిపై సీబీఐ, ఐటీ సంస్థల దాడులు జరిగాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి మోదీయే మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు.

బాబు ఆర్థికంగా బలంగా ఉంటే ఎప్పటికైనా తమకు నష్టం కలిగే అవకాశం ఉందని నిర్ణయానికి వచ్చిన మోదీ, షాలు ఆ మూలాలను కదిలించే పనిని తాజాగా వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే రాయపాటిపై దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో దొరికిన సమాచారం మేరకు సీబీఐ తదుపరి అడుగులు ఉంటాయని.. ముఖ్యంగా టీడీపీ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టడమే వీటి లక్ష్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ప్రస్తుత నేత సుజనా చౌదరిపై ఉన్న కేసులను కూడా తవ్వే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తద్వారా బీజేపీలో ఉన్నంత మాత్రాన ఎలాంటి రక్షణలూ ఉండవని చెప్పడంతోపాటు చంద్రబాబును ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుందని కమలనాథులు యోచిస్తున్నట్టు సమాచారం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...