Switch to English

క్రియేటివ్‌ దోపిడీ: స్కూటీల మీద ‘టన్నుల కొద్దీ’ మోసేశారట

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి అవసరమైన సామాగ్రిని తరలించేందుకు స్కూటీల్ని వినియోగించారట. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌.. హెవీ డ్యూటీ వాహనం.. అంటే అందరికీ తెల్సిందే.. రెండు చక్రాల బండి ఇది. దీని మీద టన్నులకు టన్నుల బరువైన సామాగ్రిని తరలించడమెలా అవుతుంది.? గట్టిగా ఓ 100 కిలోల బరువు తీసుకెళ్ళాలంటేనే కష్టమైన వ్యవహారం. కానీ, రాజకీయ నాయకులకు అది ఏమాత్రం కష్టం కాదు. ఎందుకంటే, చూపించేది లెక్కల్లోనే తప్ప.. అక్కడ పని జరిగేదేమీ వుండదు.

పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గతంలో కాంట్రాక్ట్‌ సంస్థగా వ్యవహరించిన ట్రాన్స్‌ట్రాయ్‌ లీలలు ఇవి. ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకి పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టుని నిర్మించే అర్హత లేదని చాలాకాలం క్రితమే విమర్శలు వచ్చాయి. కానీ, ఆ సంస్థకే ఆ ప్రాజెక్టు బాధ్యతల్ని గతంలో అప్పగించారు. అప్పట్లో కాంగ్రెస్‌, ఆ తర్వాత టీడీపీ.. రాయపాటి సాంబశివరావుకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌పై ప్రత్యేకమైన మమకారం చూపించిన మాట వాస్తవం.

ఈ ఎపిసోడ్‌లో బీజేపీ పాత్ర కూడా తక్కువేమీ కాదు. నరేంద్రమోడీ హయాంలోనే ట్రాన్స్‌ట్రాయ్‌.. మరింత చురుగ్గా వ్యవహరించింది.. ప్రాజెక్టుని నిర్మించడంలో కాదు, దోచుకోవడంలో.. అన్న విమర్శలున్నాయి. ‘అబ్బే, అదంతా బూటకం..’ అని రాయపాటి, ట్రాన్స్‌ట్రాయ్‌ చెప్పొచ్చుగాక. కానీ, స్కూటీల మీద సామాగ్రిని తరలించామని చెబుతూ, ఇన్వాయిస్‌లు సృష్టించారంటేనే, దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది.

‘పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతీ జరగలేదు..’ అని కేంద్రం గతంలో పలు మార్లు స్పష్టత ఇచ్చిన దరిమిలా, ఇప్పుడీ నిజాల నిగ్గు తేలాలి. ట్రాన్స్‌ట్రాయ్‌పైనా, రాయపాటిపైనా సీబీఐ సోదాల నేపథ్యంలో ఈ అక్రమాల గుట్టు వెలుగు చూసిందంటూ మీడియాలో కథనాలు విన్పిస్తున్నాయి. రాజకీయ నాయకులపై ఇలాంటి విచారణలు సర్వసాధారణమే. కొండని తవ్వి, ఎలకని పట్టిన చందం.. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ చూస్తున్నాం. ఒక విజయ్‌ మాల్యా.. ఒక నీరవ్‌ మోడీ.. ఇప్పుడు ఒక రాయపాటి.. అంటున్నారు. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెలా.? రాజకీయ నాయకుల అవినీతి ఆటకట్టించేదెలా.?

రాజకీయ నాయకుల అవినీతి.. అంటే, మీడియాకి టీఆర్పీ రేటింగుల కోసం పనికొచ్చే ‘పబ్లిసిటీ ఐటమ్‌’ అవుతోంది తప్ప, అక్రమార్కులు దోచేసిన సొమ్ముని, తిరిగి దేశం ఖజానాలో జమచేసే పరిస్థితి లేకపోవడం దురదృష్టకరం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....