మాస్ మహారాజా రవితేజ( Raviteja),కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఈగల్( Eagle)’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ‘ ‘తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా.. అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు’ అంటూ నవదీప్ చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమై ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని నేను’ అంటూ రవితేజ తన పాత్రని పరిచయం చేసే డైలాగ్ అదిరిపోయింది. ఇందులో ఆయన లుక్ కూడా కొత్తగా ఉంది.
‘ ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసాన్ని ఆపేవాడు దేవుడు..ఈ దేవుడు మంచోడు కాదు మొండోడు’ అంటూ హీరో చెబుతున్న డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran) రవితేజకు జోడిగా నటిస్తోంది. మధుబాల, నవదీప్, అజయ్ ఘోష్ కీలకపాత్రలో నటిస్తున్నారు.