Rashmika: హీరోయిన్ రష్మిక (Rashmika) డీప్ ఫేక్ వీడియో ఆమధ్య దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రముఖ యూట్యూబర్ జారా పటేల్ వీడియోను రష్మిక ఫేస్ ఉపయోగించి ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు. దీంతో అలజడి రేగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడీ కేసులో పురోగతి సాధించారని.. నలుగురు అనుమానితులను గుర్తించి విచారించారని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే.. విచారణలో భాగంగా ఆ వీడియోను తాము క్రియేట్ చేయలేదని వారు పోలీసులకు తెలిపినట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఇచ్చిన సమాచారం మేరకు నలుగురిలో ముగ్గురిని ట్రాక్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై రష్మికతోపాటు అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, కీర్తి సురేశ్, చిన్మయి తదితరులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ఐటీ శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.