Eagle : రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఈగల్ కాకుండా మరో నాలుగు సినిమాలు కూడా విడుదల అయ్యాయి. దాంతో పోటీ వద్దనే ఉద్దేశ్యంతో దిల్ రాజుతో పాటు నిర్మాతల మండలి పెద్దలు ఈగల్ సినిమాను వాయిదా వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నించి సఫలం అయ్యారు.
ఆ సమయంలో ఈగల్ సినిమా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సోలో రిలీజ్ కి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దిల్ రాజు నుంచి ఈగల్ నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా వారికి హామీ దక్కింది. అందుకే వారు ఆ సమయంలో సినిమాను వాయిదా వేయడం జరిగింది.
ఇప్పుడు ఫిబ్రవరి 9న సినిమాను ఈగల్ ను విడుదల చేయాలి అనుకుంటే అదే రోజున పలు సినిమాలు బాక్సాఫీస్ వద్దకు వస్తున్నాయి. దాంతో ఈగల్ నిర్మాతలు నిర్మాతల మండలిని ఆశ్రయించారు. తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 9న విడుదల అవ్వబోతున్న అన్ని సినిమాలను దిల్ రాజు మాట్లాడి వాయిదా వేయించాల్సి ఉంది. మరి అందులో ఎన్ని సినిమాలు వాయిదా వేసేందుకు రెడీ అవుతాయో చూడాలి.