ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ యాంకర్ అనసూయకు సంబందించిన ఫోటో ఒకటి ట్రోల్ అవుతూ పెద్ద దుమారమే రేపుతోంది. ఈ విషయంలో అనసూయ పై పలువురు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు కూడా. అసలు ఎందుకు అనసూయను అంతలా టార్గెట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న?
అనసూయ తన ఇంట్లో భర్త శశాంక్ భరద్వాజ్ కు మెడపై మసాజ్ చేస్తున్న సమయంలో ఆమె కొడుకు తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అనసూయ అప్లోడ్ చేసింది. ఆ ఫోటోను చుసిన నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. టైం దొరికినప్పుడు భర్తకు సేవలు చేసుకోవడం మంచిదే కానీ ఇలా వొంటిపై షార్ట్, చెడ్డీలు ధరిస్తూ సభ్య సమాజానికి ఏమి మెసెజ్ ఇస్తున్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
సభ్య సమాజంలో ఉంటూ ఇలా పాచ్యాత్య పోకడలు పోతూ .. నెక్స్ట్ జనరేషన్ కు ఏమి చెబుతున్నావంటూ బాగానే ఆడేసుకుంటున్నారు. కావాలని ఇలా చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ పబ్లిసిటీ కోసం నానా హంగామాలు చేస్తున్నావంటూ కార్నర్ చేస్తూ కొందరు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి పాపం అనసూయ తన భర్తకు చేస్తున్న మసాజ్ కంటే ఈమెకు నెటిజన్స్ ఇస్తున్న మెసెజ్ లే ఎక్కువయ్యాయి. మరి ఈ విషయం పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.