కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద ముప్పు నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ శుక్రవారం బీహార్లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్ లలో జరిగే సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం ఆయన ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నా బయలుదేరారు. ఇద్దరు పైలెట్లతోపాటు 8 మంది ప్రయాణించడానికి వీలున్న ఈ చార్టెడ్ ఫ్లైట్ ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు అప్రమత్తమయ్యారు. తమ పరిస్థితిని గ్రౌండ్ కంట్రోల్ కి వివరించి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి తీసుకున్నారు. వెంటనే విమానాన్ని ఢిల్లీకి మళ్లించి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
జరిగిన సంఘటనను రాహుల్ గాంధీ స్వయంగా ట్విట్ఱర్లో పోస్ట్ చేశారు. విమానం ఇంజిన్లో తలెత్తిన లోపం కారణంగా తాము ఢిల్లీ వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చిందని, ఈ రోజు జరగబోయే ప్రచార సభలు కాస్త ఆలస్యమవుతాయని, క్షమించాలని కోరారు. ఇందుకు సంబంధించి విమానంలో తీసిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. కాగా, జరిగిన సంఘటనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. మరోవైపు ఈ ఘటనపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.
Engine trouble on our flight to Patna today! We’ve been forced to return to Delhi. Today’s meetings in Samastipur (Bihar), Balasore (Orissa) & Sangamner (Maharashta) will run late. Apologies for the inconvenience. pic.twitter.com/jfLLjYAgcO
— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2019
94748 132958Spot on with this write-up, I truly think this website needs considerably much more consideration. Ill probably be once more to read a lot a lot more, thanks for that info. 728721
495015 715261You should take part in a contest for among the best blogs on the internet. I will recommend this website! 847167
8547 333916Im not confident why but this weblog is loading incredibly slow for me. Is anyone else having this problem or is it a problem on my end? Ill check back later and see if the problem still exists. 319090
130053 161448Just wanna input on couple of general issues, The internet site layout is perfect, the articles is extremely superb : D. 131477