Switch to English

పారెట్.. యూ ఆర్ అండర్ అరెస్ట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

‘డ్రగ్ మాఫియా పారిపోవడానికి సహకరించావ్. నేరస్థులకు సహకరించడం కూడా నేరమే. అందుకే నిన్ను అరెస్టు చేస్తున్నాం’ – ఇది ఏ వ్యక్తినో ఉద్దేశించి అన్న మాటలు కాదండోయ్. ఓ రామచిలుకను అరెస్టు చేసిన సందర్భంగా బ్రెజిల్ పోలీసుల డైలాగ్ ఇది.

ఇంతకీ విషయం ఏమిటంటే… బ్రెజిల్ లో డ్రగ్స్ అక్రమ రవాణా కార్యకలాపాలు ఎక్కువ. స్మగ్లింగ్ ముఠాలు పలు మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తుంటాయ్. వారిని పట్టుకోవడానికి పోలీసులు పలు ప్రయత్నాలు చేస్తుంటారు. పోలీసుల కన్నుగప్పి వారు తప్పించుకుంటుంటారు. ఈ విషయంలో స్మగ్లింగ్ ముఠాలు ఇటీవల కాలంలో కాస్త తెలివి మీరాయి. పోలీసుల కళ్లు గప్పి పారిపోవడానికి పక్షులనూ వాడుకుంటున్నాయి. ఇందుకోసం వాటికి తగిన శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటున్నాయి.

తాజాగా ఉత్తర బ్రెజిల్ లో భారీగా కొకైన్ అక్రమ రవాణా సాగుతోందని పోలీసులకు తెలియడంతో వారు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. స్మగ్లర్లు ఉన్న భవనంలోకి దూసుకెళ్లారు. ఈ విషయం లోపల ఉన్న స్మగ్లర్లకు తెలియలేదు. అయితే, పోలీసుల రాకను అక్కడే ఉన్న రామచిలుక పసిగట్టింది. ‘మామా.. పోలీస్’ అని గట్టిగా అరిచింది. దీంతో అక్కడున్న వారంతా మరో మార్గంలో చాకచక్యంగా తప్పించుకుని పారిపోయారు. పోలీసులు వచ్చేసరికి అక్కడ రామచిలుక తప్ప ఎవరూ లేరు.

స్మగ్లర్లు తప్పించుకోవడానికి కారణం ఆ చిలుకే అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. వెంటనే దానిని అరెస్టు చేసి, జైలులో పెట్టారు. తాము వెళ్లేసరికి ఆ చిలుక మామా పోలీస్ అని హెచ్చరించిందని, దీంతో వారు పారిపోయారని ఈ ఆపరేషన్లో పాలుపంచుకున్న ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఇందుకోసం దానికి శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. అయితే, చిలుకను అరెస్టు చేసిన పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని నుంచి ఎలాంటి వివరాలూ రాబట్టలేకపోయారట. ఎంతసేపు అడిగినా, అది నిశ్శబ్దంగానే ఉందని, నోరు తెరచి ఒక్క మాట కూడా మాట్లాడలేదని స్థానిక పత్రికలు వెల్లడించాయి.

ఎంతో మంది పోలీసు అధికారులు వచ్చి, అడిగినా ఆ చిలుక సైలెంట్ గానే ఉందని అలెగ్జాండర్ క్లార్క్ అనే స్థానిక వెటర్నరీ డాక్టర్ తెలిపారు. మరోవైపు చిలుకను అరెస్టు చేయడం పట్ల జంతు ప్రేమికులు భగ్గుమన్నారు. అమాయక మూగజీవాలను అలా అరెస్టు చేయడం సబబు కాదని, వెంటనే దానిని వదిలిపెట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. చిలుక ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, జంతు ప్రేమికుల ఆందోళనలు పెరగడంతో పోలీసు అధికారులు ఆ చిలుకను స్థానిక జూకి తరలించారు. అక్కడ మూడు నెలలపాటు దానికి ఎగరడంలో శిక్షణ ఇచ్చిన తర్వాత వదిలిపెడతారు.

బ్రెజిల్ లో స్మగ్లర్లు తమ కార్యకలాపాలకు జంతువులను వినియోగించడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అయితే, వాటికి శిక్షణ ఇచ్చి తమను హెచ్చరించే విధంగా ఇలా ఉపయోగిచడం మాత్రం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. 2008లో పోలీసులు ఓ స్మగ్లర్ల డెన్ పై దాడి చేసినప్పుడు రెండు మొసలి పిల్లలు దొరికాయి. తమ శత్రువులను వాటికి ఆహారంగా వేసేవారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే, వాటిని ఓ గ్యాంగ్ స్టర్ తండ్రి తోసిపుచ్చారు. తన కొడుకు ఓసారి అలా చేయడానికి ప్రయత్నించినా, అవి మానవ మృతదేహాలను తినడానికి ఆసక్తి చూపలేదని చెప్పారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...