Switch to English

రఘురామ లేఖాస్త్రం.. ఈసారి చీఫ్‌ సెక్రెటరీకి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖాస్త్రం సంధించారు. ఈసారి తన లేఖాస్త్రాన్ని ఏపీ చీఫ్‌ సెక్రెటరీకి పంపడం గమనార్హం. ఇన్పర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న దేవేందర్‌ రెడ్డి, సోషల్‌ మీడియా వేదికగా తనపై అభ్యంతకరమైన రీతిలో రాజకీయ విమర్శలు చేశారన్నది రఘురామకృష్ణరాజు ఆరోపణ.

ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటోన్న ఓ ఉద్యోగి, పార్లమెంటు సభ్యుడినైన తన మీద రాజకీయ విమర్శలు చేయడం సబబు కాదన్నది రఘురామకృష్ణరాజు ఆరోపణ. వెంటనే ఈ విషయమై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని చీఫ్‌ సెక్రెటరీకి విజ్ఞప్తి చేశారు నర్సాపురం ఎంపీ.

‘పచ్చ మీడియా జాతీయ అధికార ప్రతినిది¸గా మారిన విగ్గు రాజు! గత కొంతకాలంగా తేడా 5, అంధ జ్యోతి స్క్రిప్ట్‌ ప్రకారం ఆయా ఛానెళ్ళలో అరివీర భయంకర నటన ప్రదర్శిస్తూ తన అవకాశవాదాన్ని బయటపెట్టిన విగ్గురాజుగారు దాంట్లో కాస్తయినా నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం చేసుంటే బాగుండేది. కానీ అతి నటనతో విలువ తీసుకున్నాడు’ అన్నది దేవేందర్‌రెడ్డి గుర్రంపాటి ట్వీటు సారాంశం. ఈ ట్వీట్‌ కింద వైసీపీ మద్దతుదారులు మరింత జుగుప్సాకరంగా రఘురామకృష్ణరాజుని విమర్శిస్తూ కామెంట్లు చేశారు.

కాగా, తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోని పక్షంలో, ప్రభుత్వం తరఫున ఈ దాడి తన మీద చేయిస్తున్నట్లుగా భావించి, ఇదే విషయాన్ని పార్లమెంటరీ ప్రివిలేజీ కమిటీ ముందుంచుతానని కూడా పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు. ఏదిఏమైనా, ఈ తరహా ‘పైత్యం’ అధికార పార్టీకి చెందిన నేతల్లోనే కాదు, కొందరు అధికారుల్లోనూ ఈ మధ్య చాలా ఎక్కువగా కన్పిస్తోందన్నది నిర్వివాదాంశం.

‘అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా మారిపోయారు’ అనే విమర్శలు ఈ మధ్య మరింత ఎక్కువగా విన్పిస్తున్న దరిమిలా, ఈ ‘చెత్త రాజకీయానికి’ ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్న డిమాండ్‌ రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. రఘురామరాజుని సొంత పార్టీకి చెందిన నేతలతోనే తిట్టించి మరీ, ఆయన్ని పార్టీకి దూరం చేసే ప్రయత్నం వైసీపీ అధిష్టానం చేస్తోంటే, ఆయన మాత్రం.. తనకింకా వైఎస్‌ జగన్‌ మీద, పార్టీ మీద ప్రేమ పెరుగుతోందే తప్ప, తగ్గడంలేదని చెబుతుండడం గమనార్హం. అఫ్‌కోర్స్‌, ఆయనా తనదైన స్టయిల్లో రాజకీయం చేస్తున్నారనుకోండి.. అది వేరే సంగతి.

రఘురామ లేఖాస్త్రం.. ఈసారి చీఫ్‌ సెక్రెటరీకి.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...