బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌తో డీలాపడ్డా, పూరి జగన్నాథ్‌లో ఏదో మ్యాజిక్ వుంది. సైలెంట్‌గా వచ్చి వైలెంట్‌గా హిట్ కొట్టడం పూరి జగన్నాథ్ ప్రత్యేకత. అలాంటి వైలెంట్ హిట్, ‘ఇస్మార్ట్ శంకర్’తో పూరి కొట్టబోతున్నాడా.? అంటే, ఇన్సైడ్ సోర్సెస్ ఔననే అంటున్నాయి. సినిమా చాలా బాగా వచ్చిందన్న ఇన్సైడ్ టాక్‌తో సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది. రామ్ మార్కెట్‌ని మించి, ఈ సినిమాకి బిజినెస్ అవడంతో పూరి జగన్నాథ్‌తోపాటు ‘పూరి కనెక్ట్స్’ పార్టనర్ ఛార్మి కూడా పండగ చేసుకుంటోంది.
సినిమా హిట్టయితే కళ్ళు చెదిరే లాభాలు రావడం ఖాయమని పూరి అండ్ ఛార్మి క్యాంప్ అంచనా వేస్తోందట. ‘రెట్టింపు లాభాలు ఖాయం..’ అని బయ్యర్లలోనూ ఆశలు కలుగుతున్నాయి సినిమా ప్రోమోస్ వచ్చిన తర్వాత, వాటికి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తర్వాత. నిజమే, ఇటీవలి కాలంలో ఇంత ఊర మాస్ సినిమా వచ్చింది లేదు.
పైగా, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నుంచి వస్తోన్న హై ఓల్టేజ్ మసాలా సినిమా ఇది. హీరోయిన్ల గ్లామర్ ఈ సినిమాకి అదనపు అడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. అస్సలేమాత్రం మొహమాటం లేకుండా నభా నటేష్, నిధి అగర్వాల్ ఎక్స్‌పోజింగ్‌లో పోటీ పడ్డారు. అటు మాస్ డైలాగులు, ఇటు మాస్ మెచ్చే డాన్సులు, వీటితో పాటే హీరోయిన్ల గ్లామర్, వీటన్నిటికీ మించి పూరి జగన్నాథ్ మేకింగ్.. వెరసి ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు ముందు ఓ రేంజ్లో హైప్‌ని పెంచేసుకుంటూ పోతోంది.
సినిమాలో ట్విస్టులు అదిరిపోతాయనీ, యాక్షన్ ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ అనీ, సినిమా చూసిన అతి కొద్ది మంది ఆఫ్ ది రికార్డ్‌గా సినిమా విశేషాల్ని బయటపెట్టేస్తున్నారు. ఆ మౌత్ టాక్, సినిమా ఓపెనింగ్స్‌పై మంచి ప్రభావమే చూపబోతోందని నిస్సందేమంగా చెప్పొచ్చు.
188019 224882Glad to be one of the visitors on this awe inspiring internet website : D. 330781
632672 406792Thanks for all your efforts that you have put in this. quite interesting info . 922370
815443 822879yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. It is punk up to closed ego dispirited. All respecting those topics are movables her ought to discover no end touching unpronounced. Thanks so considerably! 5026