Switch to English

“గాజువాక లో పవన్ గెలుపు సందేహమేనా?!!”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గాజువాకలో గెలిచే అవకాశం లేదని.. ఒక ప్రముఖ దినపత్రిక పెద్ద కథనాన్ని వండివార్చింది. నిజంగా ఆ అవకాశం ఉందా అన్నది కూడా ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక ఖచ్చితమైన సమాచారం లేనిదే ఆ పత్రిక ఇలాంటి కథనాన్ని ప్రసారం చేయదనే వారు ఉన్నారు. నిజానికి చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ లోపాయికారి ఒప్పందంలో ఉన్నారన్న వార్తలు మొదటి నుంచి వస్తున్న తరుణంలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఆ పత్రికలోనే ఇలాంటి కథనం రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఆ పత్రిక కథనం ప్రకారం పవన్‌కళ్యాణ్‌ గాజువాకలో ఓటమిపాలు కాబోతున్నారన్నది. ఇంకా ఆశ్చర్యపోవలసిన అంశం ఏంటంటే ఇక్కడ నిన్నటివరకు తెలుగుదేశం, జనసేనలే అనేస్థాయి నుంచి లీడ్‌లోకి వైకాపా అభ్యర్థి రావడం. గాజువాకలో వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడనే అంచనాలు ఇచ్చింది. ఆయనకు సానుభూతి పవనాలు చాలా గట్టిగా వినిపించాయని.. బయటికి ఇతర పార్టీల్లో తిరిగినవారు కూడా పోలింగ్‌కి వచ్చేసరికి నాగిరెడ్డికి వేశారని వార్తలు వస్తున్నాయి.

2009లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిరెడ్డి మంచి ఓట్లశాతాన్నే తెచ్చుకున్నారు. అటు తరువాత వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 2014లో వైకాపా తరపున పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం తిరిగి ఆయన వైకాపా అభ్యర్థిగా బరిలోకి నిలవడం.. పవన్‌కళ్యాణ్‌కు చాలా వయసు ఉందని… ఆయన మరోసారి, మరోచోట అయినా గెలిచే అవకాశం ఉందని.. కానీ నాకు ఇక వయసు అయిపోయింది.. అఖరి ఛాన్స్‌ ఇక నేను పోటీచేయనని ప్రతి గడపకు నాగిరెడ్డి తిరిగి అభ్యర్థించడంతో ఆ సానుభూతి పవనాలు చాలా గట్టిగా వినిపించాయని బయటికి వినిపిస్తోంది.

వైకాపా కూడా ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. దాదాపు వారంరోజుల నుంచే డబ్బు పంపకాలతో పాటు ఇతరత్రా అన్ని అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని అక్కడ లోలోపల వ్యవహారం చక్కబెట్టడం.. తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కూడా సహాయసహకారాలు అందించాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనితో గాజువాకలో ఖచ్చితంగా గెలుస్తాడనుకున్న పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఖచ్చితంగా నాగిరెడ్డి చేతిలో ఓడిపోతాడని తెలుస్తోంది.

తెలుగుదేశం అభ్యర్థి చంద్రబాబును తన నియోజకవర్గంలో ప్రచారానికి ఆహ్వానించినా ఆయన రాకపోవడం, లోకల్‌ నాయకులు కూడా ఆయనకు పెద్దగా సహకరించకపోవడంతో ఆయనకు విషయం అర్థమై.. లోలోపల తమ క్యాడర్‌ను అంతా వైకాపాకు అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పదం కుదిరిందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి విశ్లేషణలు లేకుండా అంతపెద్ద పత్రిక ఇలాంటి అతిపెద్ద కథనాన్ని ఇవ్వదని.. ఖచ్చితమైన సమాచారం లోకల్‌గా అందితేనే ఇస్తుందని అంటున్నారు.

రెండుచోట్లా పవన్‌ ఖచ్చితంగా గెలుస్తాడు.. దేన్ని వదులుతాడో అనేటువంటి వార్తలు నిన్నటి వరకు వినిపించేవి. ఇప్పుడు వార్‌ వన్‌సైడ్‌ అని తేలిపోవడంతో అటు జనసేన వర్గాలు కూడా ఈ నియోజకవర్గం విషయంలో తీవ్ర నైరాశ్యంలోకి కూరుకుపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేల ఇదే నిజమైతే జనసేన ఆశలు గాజువాకలో ఖచ్చితంగా వదులుకోవాల్నిందే.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...