Pawan Kalyan: పవర్ స్టార్ (Power Star) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈసారి మరింత శక్తివంతంగా సిద్ధమవుతున్నారు. ‘నెత్తురుకు మరిగిన హంగ్రి చీతా’ అంటూ అభిమానుల్లో ఆశలు, ట్రేడ్ లో భారీ అంచనాలు పరిశ్రమ, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఆ సినిమానే ‘ఓజీ’. (OG) నిర్మాత దానయ్య నిర్మాణంలో దర్శకుడు సుజీత్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులకు పూనకాలే తెప్పించింది.
వీటిని రెట్టింపు చేస్తూ.. దసరా సందర్భంగా పవన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. చిరుతపులిలా చురుకైన చూపుతో ఉన్న పవన్ కల్యాణ్ పిక్ అదిరిపోయిందని చెప్పాలి. ఆ కళ్లు చాలు బాక్సాఫీస్ కలెక్షన్ల వేటకు అన్నట్టున్న స్టిల్ ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మరోవైపు.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న సినిమాకు సంబంధించి సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. పవన్ తనదైన స్టయిల్లో ఉన్న పిక్ ఆకట్టుకుంటోంది. రెండు సినిమాల స్టిల్స్ అభిమానులను అలరిస్తున్నాయి.