“బిచ్చగాడు” సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో విజయ్ ఆంటోనీ. మరోసారి ఆయన “తుఫాన్” మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో ఇదే నిర్మాణ సంస్థ విజయ్ ఆంటోని నటించిన రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది.
పొయిటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ” తుఫాన్ ” సినిమాను దర్శకుడు విజయ్ మెల్టన్ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా నుంచి ”తుఫాన్ లా ” అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ లోని సంఘర్షణను వివరిస్తూ ఈ పాటను రూపొందించారు. విజయ్ ఆంటోనీ, అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ పాటను హైమత్ మహమ్మద్ ఆలపించారు.
ఈ సినిమాలో శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మురళీ శర్మ, పృథ్వి అంబర్, శరణ్య, తలైవాసల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.