Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమాగా నిలిచింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమా ప్రీ-బుకింగ్స్ తోనే రికార్డులు తిరగరాస్తోంది. ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా దాటేసి మరిన్ని రికార్డుల దిశగా పయనిస్తోంది.
అమెరికాలో కల్కి ఇప్పటికే మిలియన్ డాలర్ల ప్రీ-సేల్ బుకింగ్స్ జరగడం భారతీయ సినిమాల్లోనే రికార్డు. విడుదల వరకూ ఇదే జోరు కొనసాగితే 2మిలియన్ డాలర్లు చేరుకోవడం అసాధ్యం కాకపోవచ్చని ట్రేడ్ అంచనా. ఆస్ట్రేలియాలో 9లోకేషన్లలో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా 90 ఐమాక్స్ స్క్రీన్స్ లో కల్కిని విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇండియన్ సినిమాల్లో ఇదొక రికార్డు.
సినిమా ప్రచారంలో వేగం పెంచారు. ర్యాలీలు, కల్కి పేరుతో వ్యాన్లు, టీషర్టులు సందడి చేస్తున్నాయి. ఇటివలే బుజ్జి వెహికల్ ను మహీంద్రా ఆధినేత ఆనంద్ మహీంద్రా నడిపారు. సినిమా ప్రీ-రిలీజ్ ను అమరావతిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.