Switch to English

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,325FansLike
57,764FollowersFollow

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని ఉద్దేశించి జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.

కట్ చేస్తే.. ఇప్పుడు ‘డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్’.! టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అయితే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. పంచాయితీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ.. ఇలా కీలక శాఖలకు ఇకపై మంత్రిగా వ్యవహరించనున్నారు కొణిదెల పవన్ కళ్యాణ్.

ఇంకా కొందరు ‘అభిమానం’ ముసుగులో, ‘పవన్ కళ్యాణ్ హోం మంత్రిత్వ శాఖని తీసుకుని వుండాల్సింది’ అంటూ సోషల్ మీడియాలో, తమకు తోచిన రీతిలో కామెంట్లు పోస్ట్ చేసుకుంటూ వెళుతున్నారనుకోండి.. అది వేరే సంగతి.

‘వ్యూహం నాకు వదిలెయ్యండి..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్నికల ముందు బలంగా.. చాలా బలంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎలా వుంటాయో, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగని, పవన్ కళ్యాణ్‌ని ఎవరూ ప్రశ్నించకూడదా.? అంటే, ప్రశ్నించకూడదని ఎవరు మాత్రం అనగలరు.!

21 అసెంబ్లీ 2 లోక్ సభ సీట్లలో పోటీ చేసిన జనసేన, అన్ని సీట్లలోనూ విజయం సాధించింది. అంతకు ముందు 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేయాల్సి వుంది. బీజేపీతో పొత్తు నేపథ్యంలో మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది జనసేనకి.

వాస్తవానికి, 65కి పైగా సీట్లలో జనసేన పోటీ చేయాలని అప్పట్లో కొందరు జనసేన మద్దతుదారులు నినదించారు, పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకూ ప్రయత్నించారు. అప్పుడే, ‘వ్యూహం నాకు వదిలెయ్యండి..’ అని జనసేనాని స్పష్టంగా వారికి చెప్పారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాల్సి వుంది, ఆయా శాఖల్లో గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించాలి, వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి.. ప్రభుత్వ పరమైన ఈ బాధ్యతలతోపాటు, పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలి.

ముందు ముందు పవన్ కళ్యాణ్‌ మరింత బలంగా వ్యూహాలు రచించాలంటే, ఆయన్ని ఇంకా బలంగా జనసైనికులు విశ్వసించాల్సి వుంటుంది. సమీప భవిష్యత్తులో పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే, అంతకన్నా ముందు స్థానిక ఎన్నికలు వంటివి అత్యంత కీలకం.

శాసన మండలి, రాజ్యసభ.. ఇలా అన్ని చోట్లా జనసేన ప్రాతినిథ్యం వుండేలా జనసేనాని పదునైన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసి వుంటారు. ఆ విషయాన్ని ఆయన గతంలోనే ప్రస్తావించారనుకోండి.. అది వేరే సంగతి. పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలెప్పుడొస్తాయ్.. సినిమాటిక్ హంగామా ఎప్పుడు చేద్దాం.. అని కాకుండా, పవన్ కళ్యాణ్‌ని పూర్తిస్థాయి నాయకుడిగా అనుసరించడం జనసేన అభిమానుల ముందున్న తక్షణ కర్తవ్యం.

అన్నిటికీ మించి, అభిమానం.. పవన్ కళ్యాణ్‌కి బలం అవ్వాలి తప్ప, బలహీనత కాకూడదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Peka Medalu: ‘పేక మేడలు’ సినిమా సరికొత్త ప్రమోషన్.. రూ.50కే టికెట్...

Peka Medalu: 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా చేసిన సినిమా ‘పేక మేడలు’ (Peka...

అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా “కల్కి”.. కమల్ హాసన్

ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "కల్కి 2898 AD". గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది....

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ OTT స్ట్రీమింగ్..!...

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన...

Samantha: లైఫ్ లో ఇప్పుడే ధృడంగా ఉన్నా.. కారణం అదే: సమంత

Samantha: జీవితంలో ఎదురైన అనుభవాలతో గతం కంటే ఇప్పుడు తానెంతో బలంగా తయారయ్యానని నటి సమంత (Samantha) అన్నారు. ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడారు. ‘జీవితంలో...

Heroine: క్యాన్సర్ తో పోరాడుతున్న నటి.. అయినా షూటింగులకు హాజరు..

Heroine: స్టేజి త్రీ క్యాన్సర్ తో పోరాడుతూ కూడా బాలీవుడ్ నటి హీనా ఖాన్ (Hina Khan) సినిమా షూటింగ్స్ లో పాల్గొనడంపై సర్వత్రా హర్షం...

రాజకీయం

పవన్ కళ్యాణ్ మీద కార్టూన్: ‘పచ్చ’ బుద్ధి బయటపెట్టుకున్న ఆర్కే.!

టీడీపీ అను‘కుల’ మీడియాలో ఏబీఎన్ ఆర్కేని పెద్ద ముత్తైదువగా పేర్కొంటుంటారు.! కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తిగా ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణకి మీడియా, రాజకీయ వర్గాల్లో ఓ ఘనమైన పేరు ప్రఖ్యాతులున్నాయ్....

బీఆర్ఎస్ ఎంఎల్సీ కవితకు అస్వస్థత

భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంటనే దీన్...

గెలిచాం.! విర్రవీగొద్దు.! కఠిన చర్యలుంటాయ్: పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్.!

నాయకుడంటే ఎలా వుండాలి.? ఇదిగో, ఇలా వుండాలి.! పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి, దేశం దృష్టిని ఆకర్షించింది జనసేన...

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్ పథకం అమలు ఆరోజునే

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చే దశలో అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి...

విజయసాయిరెడ్డి వ్యవహారంపై వైఎస్ జగన్ స్పందించరెందుకు.?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయ సాయి రెడ్డి మీద తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మామూలు ఆరోపణలు కావివి, అత్యంత తీవ్రమైన ఆరోపణలు. తన భార్యకు పుట్టిన...

ఎక్కువ చదివినవి

విజయసాయి రెడ్డి వేధింపుల వల్లే రామోజీ అలా.?

రాజ్యసభ సభ్యుడు వైసీపీ నేత, విజయసాయి రెడ్డి ట్వీట్లేస్తే జనం పట్టించుకుంటారా.? ఛత్.. వైసీపీ శ్రేణులే ఆ ట్వీట్లని పట్టించుకోవ్.! పెయిడ్ వైసీపీ కూలీలు కూడా పట్టించుకోని విజయసాయి రెడ్డి ట్వీట్లను, ఈనాడు...

ఏపీ పాలనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కు.!

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తాను ఏరికోరి తీసుకున్న శాఖలకు సంబంధించి సమీక్షల్ని కొనసాగిస్తూనే వున్నారు. ఓ వైపు సమీక్షలు, ఇంకో వైపు ఆయా శాఖల పరంగా చేస్తున్న కార్యక్రమాలు.....

యాక్షన్ మోడ్‌లోకి రఘురామ.! జగన్ అరెస్ట్ తప్పదా.?

టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒకప్పుడు వైసీపీ ఎంపీగా పనిచేసిన సంగతి తెలిసిందే. వైసీపీ రెబల్ ఎంపీగా వున్న సమయంలో, రఘురామకృష్ణరాజు మీద అప్పటి జగన్ ప్రభుత్వం రాజద్రోహం సహా పలు సెక్షన్ల కింద...

విజయ సాయి రెడ్డి ‘గే’ కామెంట్లు.! ఈయనసలు చట్ట సభల్లో వుండాల్సినోడేనా.?

తన కాపురంలో విజయసాయి రెడ్డి చిచ్చు పెట్టారంటూ ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. తన భార్యని విజయ సాయి రెడ్డి వలలో వేసుకున్నాడనీ, ఆమెకు జన్మించిన బిడ్డకు అతనే తండ్రి అనీ, డీఎన్ఏ...

Peka Medalu: ‘పేక మేడలు’ సినిమా సరికొత్త ప్రమోషన్.. రూ.50కే టికెట్ ధర

Peka Medalu: 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించిన వినోద్ కిషన్ హీరోగా చేసిన సినిమా ‘పేక మేడలు’ (Peka Medalu). ఓటీటీలో మంచి విజయం సాధించిన...