పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ పై లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్నాడు. ఈమేరకు లాహోర్ అదనపు సెషన్స్ కోర్టు బాబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతేడాది నవంబర్‌లో లాహోర్‌కు చెందిన హమీజా ముక్తార్ అనే మహిళ బాబర్ పై ఈ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లాడతానని 2010లో ప్రపోజ్ చేసి శారీరకంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఆ తర్వాత తనను దూరం పెట్డాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.
హమీజా తరఫు న్యాయవాది ఇందుకు సంబంధించిన రిపోర్టులను సాక్ష్యంగా చూపడంతో న్యాయమూర్తి నోమన్ ముహమ్మద్ నయీమ్ ఈ ఆదేశాలు ఇచ్చారు. కేసులో పూర్తిస్థాయి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడులు, బెదిరింపులు కూడా వచ్చాయని హమీజా కోర్టుకు తెలపడంతో కోర్టు సీరియస్ అయింది. అబిద్ రాజా బాబర్, అతడి కుటుంబ సభ్యులను హెచ్చరించారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ టెస్ట్, టీ 20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు బాబర్.
452031 859795Merely wanna state that this is quite beneficial , Thanks for taking your time to write this. 73675
470038 862621Would love to perpetually get updated wonderful blog ! . 148166