ప్రతివారంలాగానే ఈ వారం కూడా చెత్త పలుకు బయటకొచ్చింది బూతు కిట్టు నుంచి. పంచాయితీ ఎన్నికల్లో మిత్ర పక్షం భారతీయ జనతా పార్టీతో లాభం లేదనుకుని తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదుర్చుకుందంటూ ‘బూతు కిట్టు’ తనదైన స్టయిల్లో ‘చెత్త పలుకు’ పేరుతో పాత్రికేయ వ్యభిచారం చేసేశారు.. తన మీడియా సంస్థల సాక్షిగా. అదేంటో, జనసేన అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా.. ‘బూతు కిట్టు’కి అస్సలు పడదు. కొన్నాళ్ళ క్రితం బూతు కిట్టుకి సంబంధించిన మీడియా సంస్థ తాలూకు కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పరామర్శించారు.
ఎంతైనా సీనియర్ జర్నలిస్టు కదా.. మీడియాలో ఎంతటి ‘కుళ్ళు’ పేరుకుపోయినా, మీడియా సంస్థల్ని అడ్డం పెట్టుకుని ఎంత జుగుప్సాకరమైన రాజకీయం బూతు కిట్టు చేస్తున్నా.. మీడియా పట్ల వున్న గౌరవంతో అప్పట్లో జనసేనాని ఆ పరామర్శ చేశారు. కానీ, ‘పాముకి పాలు పోస్తే మాత్రం.. విషపు కాటు వేయకుండా వుంటుందా.?’ అన్నట్టుగా ‘చెత్త పలుకు’ ద్వారా జనసేన మీద బూతు కిట్టు విష ప్రచారం ఇంకోసారి గట్టిగా చేసేశారు. సరే, ఇలాంటి విష ప్రచారాలతో జనసేనకు కొత్తగా కలిగే నష్టం ఏమీ వుండదనుకోండి.. అది వేరే సంగతి. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా.? బీజేపీతో ముందుకు వెళ్ళాలా.? అన్నదానిపై జనసేనకంటూ కొన్ని లెక్కలుంటాయి. ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఆ రాజకీయ పార్టీ కొన్ని వ్యూహాలతో ముందడుగు వేస్తుంటుంది.
ఓ మీడియా సంస్థ అధిపతిగా, అడ్డగోలు కథనాలు, దుష్ప్రచారాలు చేయడం.. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ‘పాత్రికేయ వ్యభిచారం’ చేయడం ఎంతవరకు సబబు.? అన్నదే ఇక్కడ కీలకమైన అంశం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన మద్దతిచ్చింది. అప్పట్లో టీడీపీ – బీజేపీ కలిసే వున్నాయి. రాజకీయ పార్టీలన్నాకా.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ వ్యూహాల్ని మార్చుకోవడం మామూలే. ఇవి తెలియనంత అమాయకుడైతే కాదు ‘బూతు కిట్టు’.
కేవలం జనసేన మీద పడి ఏడవడం, టీడీపీని ఉద్ధరించేస్తున్నట్లుగా ఆ పార్టీని నాశనం చేసే చర్యలకు దిగడం.. ఇదే జర్నలిజం మూల సూత్రమన్నట్టు వ్యవహరిస్తుంటాడు బూతు కిట్టు. దీన్ని జర్నలిజం అనరు.. వ్యభిచారంగా అభివర్ణిస్తే.. అది కూడా చిన్న మాటే అవుతుందేమో.!
5743 905696Cause thats required valuable affiliate business rules to get you started on participating in circumstances appropriate for your incredible web-based business concern. Inernet marketing 266785
228086 13308Hey man, .This was an excellent page for such a hard subject to talk about. I look forward to reading several much more wonderful posts like these. Thanks 784711
858990 661611Beging with the entire wales effectively before just about any planking. Our own wales can easily compilation of calculated forums those thickness analysts could be the related to some with the shell planking along with much more significant damage so that they project soon after dark planking. planking 327060
130340 557719This web site can be a walk-by way of for all with the data you necessary about this and didnt know who to ask. Glimpse here, and also you will undoubtedly uncover it. 365678