ప్రపంచం మొత్తం ఒక వైపు అయితే నేను ఒక వైపు అంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును దక్కించుకున్న ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ మృతి చెంది ఉంటాడు అంటూ గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను కొట్టి పారేసేందుకు గాను కొన్ని నెలల క్రితం కిమ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న వీడియోను విడుదల చేయడం జరిగింది. దాంతో కొన్ని రోజులు ఆ వార్తలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ ప్రచారం మొదలయ్యింది.
అంతర్జాతీయ జర్నలిస్ట్ రాయ్ కేలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కిమ్ చనిపోయి ఉంటాడని లేదంటే కోమాలో ఉండి ఉంటాడని ఆయన గట్టిగా నమ్ముతున్నట్లుగా చెప్పాడు. కిమ్ అధికారిక బాధ్యతలను ఇప్పటికే ఆయన సోదరి కిమ్ యో జోంగ్ నిర్వహిస్తుంది. ప్రజలకు ఇంకా ఈ విషయాన్ని చెప్పలేదు. మెల్లగా వారికి ఈ విషయాన్ని చెప్పాలని భావిస్తున్నారట.
యో జోంగ్ అధికారిక బాధ్యతలు తీసుకున్న తర్వాత విషయాన్ని బయటకు వెళ్లడి చేస్తారని అంటున్నారు. గతంలో కూడా కిమ్ జోంగ్ ఇల్ మృతి విషయాన్ని నెలల పాటు దాచి ఉంచి ఆ తర్వాత చెప్పారు. దేశంలో తిరుబాటు లేవకూడదనే ఉద్దేశ్యంతో ఇలా మృతి విషయాన్ని దాచి పెట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది కిమ్ సోదరి నోరు తెరిస్తే క్లారిటీ వచ్చేను.
542729 545190We will offer deal reviews, deal coaching, and follow up to ensure you win the deals you cant afford to shed. 55722
446686 938206I dugg some of you post as I thought they were very beneficial invaluable 782506