ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆయన ఆపార్టీలోకి జంప్ కావడం షరా మామూలే. అధికార పార్టీ పక్కన కూర్చోవడం.. చేతిలో అధికారం పెట్టుకోవడం వంటివి లేకుంటే ఆయనకు కడుపు నిండదు కంటినిండా నిద్రపట్టదు. ఎంతసేపు అధికారం ఉండాలి… అధికారులు తన అడుగులకు మడుగులు ఒత్తాలి… బుగ్గ కార్లలో తిరగాలనే కోరిక ఆయనలో బలంగా ఉంటుంది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఎక్కడినుంచి పోటీ చేసినా ఏదోవిధంగా గెలిచి తీరతాడు. అదీ అయన స్టైల్. ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే పర్వాలేదు.
లేదంటే గోడ దూకేయ్యడమే. ఎంతైనా బాబుగారి శిష్యరికంలో ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి కదా. అలానే ఉంటుంది. గత ఎన్నికలకు ముందు అయన ఎందుకో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీపై నమ్మకం ఉందేమో మరి. భీమిలి నుంచి పోటీ చేయకుండా విశాఖ నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. తీరా చూస్తే తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. పార్టీ ఓడిపోయిందనే బాధకంటే పార్టీ ఎలా మారాలా అనే ఆలోచనే ఆయనకు ఎక్కువైంది.
కానీ, వైకాపా కొన్ని రూల్స్ ఫాలో కావడంతో పాపం అధికార పార్టీలోకి వెళ్లలేకపోయాడు. ఒకవేళ రాజీనామా చేసి పార్టీ మారినా, మళ్ళా గెలుస్తాడా అంటే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ గెలిచినా పార్టీలో మంత్రి పదవి లభిస్తుందా అంటే అదీ కష్టమే. ఎందుకంటే వైకాపాలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉన్నవాళ్లకు సర్దిచెప్పి కొంతమందికే జగన్ పదవులు ఇచ్చారు. రెండున్నర ఏళ్ల తరువాత మంత్రి పదవులు మారే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా గంటకు అవకాశం వస్తుందనే నమ్మకం లేదు.
పదవి రానప్పుడు ఏ పార్టీలో ఉంటె ఏంటి. అందుకేగంట సైలెంట్ గా ఉన్నాడు. కొన్నాళ్ళు కేంద్రంలో చక్రం తిప్పాలని కేంద్రంతో చేతులు కలిపి ఆ పార్టీలోకి దూకాలని అనుకున్నా ఎందుకో మరి అక్కడికి కూడా వెళ్లకుండా టీడీపీలోనే ఉంటున్నాడు. పార్టీలో ఉన్నాయా అంటి అంటనట్టుగా దూరంగా ఉంటున్నాడు. పోనీలే దూరంగానే దగ్గరగానే ఎక్కడ ఉన్నా, పార్టీ అయితే మారలేదుగా. ఇది బాబుకు కొంత సంతోషించదగిన విషయమే కదా.
543310 452662I like your writing style truly loving this web site . 68768
145954 625476You made some decent points there. I looked online for that dilemma and identified a lot of people goes coupled with with all your site. 774243
188620 895370you use a great weblog here! do you need to have to make some invite posts on my weblog? 699761
834575 941862Great blog here! Also your web site loads up quickly! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as quickly as yours lol 367902