టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో నితిన్ ముందు వరసలో ఉంటాడు. ఎన్నో ఏళ్ల నుండి సినిమాలు చేస్తోన్న నితిన్, ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదు. అయితే ఈ ఏడాది మీడియాతో ముచ్చటిస్తోన్న సందర్భంలో వచ్చే ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అది పెద్దలు కుదిర్చిన పెళ్లే అవుతుందని తెలిపాడు.
ఈ నేపథ్యంలో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ పెళ్లి సెట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ నుండి కాకుండా బయట అమ్మాయిని నితిన్ పెళ్లి చేసుకోనున్నాడట. ఈ మేరకు ఇరు పెద్దల మధ్య మాటలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో ముహుర్తాలు చూస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
నితిన్ ను పరిణయమాడే ఆ వధువు ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఆ వివరాలు అన్నీ గోప్యంగా ఉంచినట్లు సమాచారం. నితిన్ ప్రస్తుతం చేస్తోన్న భీష్మ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఎంగేజ్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అప్పుడే పెళ్ళికి సంబంచిన వివరాల్ని వెల్లడిస్తారని తెలుస్తోంది.
నితిన్ ప్రస్తుతం సినిమాల పరంగా ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రష్మీకి మందన్న హీరోయిన్ గా, వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తోన్న భీష్మ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాకు కూడా కమిట్ అయ్యాడు. ఆ సినిమా చిన్న షెడ్యూల్ జరుపుకుని భీష్మ షూటింగ్ పూర్తి అవ్వడం కోసం వెయిట్ చేస్తోంది.
అలాగే నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించడానికి ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా తన మిత్రుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ సినిమా చేసే అవకాశముంది. రీసెంట్ గా బాలీవుడ్ హిట్ సినిమా అందాధూన్ సినిమా హక్కులని కొనుగోలు చేసిన నితిన్ అందులో తాను నటించనని వెల్లడించిన విషయం తెల్సిందే. భీష్మ ఫిబ్రవరి 21న విడుదల కానుంది.
445393 684434Totally indited content material , Really enjoyed seeking at . 882524
930087 632984Very good post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the most effective sequence of my past and your content kind of reminded me of that period of my life. Cheers 242226
611552 782963I quite delighted to locate this internet site on bing, just what I was seeking for : D besides saved to bookmarks . 651614
767368 476386Oh my goodness! an amazing write-up dude. Thank you Even so My business is experiencing difficulty with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss difficulty? Anybody who knows kindly respond. Thnkx 674077