మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక పెళ్లి కూతురుగా ముస్తాబయింది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యను ఆమె వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆగష్టులో నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. పెద్దలు నిర్ణయించిన వీరి పెళ్లి ఈనెల 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో రాత్రి 7:15 నిముషాలకు జరుగబోతోంది. ఇందుకు సంబంధించి నిహారిక ఈరోజు పెళ్లి కూతురుగా ముస్తాబయ్యారు.
హైదరాబాద్ లోని ఆమె స్వగహంలో ఈ వేడుక నిర్వహించారు. పసుపు రాసి, మంగళ స్నానం చేయించారు. చిలకపచ్చ రంగు చీరలో ముస్తాబైన నిహారిక మెరిసిపోతోంది. ఆమె ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్ ఈ ఫొటోలను పెళ్లి సందడికి సంబంధించి చిన్న వీడియో క్లిప్ పు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇల్లంగా తోరణాలతో అలంకరించి ఉంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి కూడా.