Switch to English

రేప్‌ కేసులో కొత్త ట్విస్ట్‌: డాలర్‌ భాయ్‌ సెల్ఫీ వీడియో

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తనను 139 మంది 5000 సార్లు అత్యాచారం చేశారంటూ సంచలన ఆరోపణలు చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించిన యువతి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. ఓ వైసీపీ నేత, సినీ నటుడిపైనా.. అలాగే ఓ బుల్లితెర స్టార్‌ యాంకర్‌పైనా సదరు యువతి ఆరోపణలు చేసింది. పోలీసులు ఈ కేసుని ఎలా డీల్‌ చేయాలి.? అని సుదీర్ఘంగా ఆలోచించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కూడా.

సరిగ్గా ఈ టైమ్ లోనే తాను చేసిన ఆరోపణల్లో కొంత అసత్యం కూడా వుందంటూ, సదరు సినీ నటుడు, సదరు బుల్లితెర స్టార్‌ యాంకర్‌ తనపై అత్యాచారం చేయలేదని వివరణ ఇచ్చింది. తొలుత ఆరోపించినట్లుగా తనపై 139 మంది అత్యాచారం చేయలేదనీ, 36 మంది చేతిలో అత్యాచారానికి గురయ్యాననీ చెప్పుకొచ్చింది.

తాజాగా, ఈ ఉదంతంలో మరో ట్విస్ట్‌ తెరపైకొచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాలర్‌ భాయ్‌.. అజ్ఞాతంలో వుంటూనే ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ఆ యువతి చేస్తున్న ఆరోపణల్లో అస్సలు నిజం లేదనీ, తొలుత 139 మంది తనపై అత్యాచారం చేశారంటూ ఆమె స్వయంగా ఫిర్యాదు చేసిందనీ, ఆ ఫిర్యాదుతో తనకు అస్సలేమాత్రం సంబంధం లేదని చెప్పుకొచ్చాడు డాలర్‌ భాయ్‌.

తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించే ప్రయత్నం ఆమె చేస్తోందనీ, తనకు ప్రాణహాని వున్నందునే తాను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాననీ, ఈ క్రమంలో తాను ఓ పోలీస్‌ ఉన్నతాధికారి సాయం తీసుకుని.. అజ్ఞాతంలోకి వెళ్ళాననీ డాలర్‌ భాయ్‌ చెప్పడం గమనార్హం. పోలీసులంటే మరీ ఆటలాట అయిపోయినట్లుంది.. అన్న చర్చ ఈ కేసు విషయమై సోషల్‌ మీడియాలో నడుస్తోంది.

కరోనా నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ఎంత కష్టపడుతుందో చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఓ సారి తన మీద 139 మంది అత్యాచారం జరిపారని యువతి ఆరోపించడం, ఆ తర్వాత అదే యువతి తనను డాలర్‌ భాయ్‌ బ్లాక్‌ మెయిల్‌ చేసి.. తనతో తప్పుడు ఫిర్యాదు చేయించాడని చెప్పడం.. ఇప్పుడేమో డాలర్‌ భాయ్‌, ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసి.. ఈ కేసులో తాను బాధితుడినంటూ తప్పుని ఆ యువతిపైకి తోసెయ్యడం.. అంతా ఓ సినిమాటిక్‌ డ్రామాని తలపిస్తోంది. ఏదిఏమైనా ఈ కేసులో నిజాలు నిగ్గు తేలాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...