Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇప్పటివరకూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నది లేదు. ఆమె అప్డేట్స్ భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Sivan) షేర్ చేసేవారు. కానీ.. ఇప్పుడు నయన్ ఇన్ స్టా (Instagram) లో అకౌంట్ ఓపెన్ చేయడం ఆమె అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. దీంతోపాటు ఆమె చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షించింది.
తొలి ఇన్ స్టా పోస్టులో తన ఇద్దరు పిల్లలను పరిచయం చేసింది. జైలర్ సినిమాలోని హుకుమ్ పాట బ్యాక్ గ్రౌండ్ తో తన కవల పిల్లలను ఎత్తుకుని వచ్చిన నయన్ వీడియో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నయనతార అకౌంట్ ఓపెన్ చేసిన గంటల్లోనే లక్షల్లో అభిమానులు ఆమెను ఫాలో అయ్యారు.
ఆమె పోస్ట్ చేసిన తొలి రీల్ కు కూడా ఏడు లక్షల వ్యూస్, రెండు లక్షల లైక్స్ వచ్చాయి. తాను నటించిన జవాన్ సినిమా ట్రైలర్ ను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇన్ స్టాలో నయనతార ఐదుగురిని ఫాలో అవుతోంది.